గాయానికి కుట్లకు బదులు ఫెవిక్విక్‌తో అతికించిన డాక్టర్ (వీడియో)

by Disha Web Desk 4 |
గాయానికి కుట్లకు బదులు ఫెవిక్విక్‌తో అతికించిన డాక్టర్ (వీడియో)
X

దిశ, అయిజ: బాలుడు కిందపడి గాయాలు కావడంతో తల్లిదండ్రులు అయిజలోని రెయిన్ బో హాస్పిటల్ ప్రైవేటు ఆసుపత్రి తీసుకెళ్లారు. అక్కడున్న వైద్య సిబ్బంది ఏకంగా కుట్లు వేయకుండా ఫెవిక్విక్ వైద్యం చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో చోటు చేసుకుంది. బాధిత తండ్రి వంశీకృష్ణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా లింగసూగూరుకు చెందిన వంశీకృష్ణ, సునీత దంపతులు అఐజకు బంధువుల పెళ్లి నిమిత్తం వచ్చారు. వీరి కుమారుడు ఏడేళ్ల ప్రవీణ్ చౌదరి గురువారం రాత్రి పెళ్లి వేడుకల్లో ఆడుకుంటూ కిందపడ్డాడు. అతని ఎడమ కంటి పైభాగంలో గాయమవడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

గాయమైన చోట వైద్య సిబ్బంది కుట్లు వేయకుండా ఫెవిక్విక్‌తో అతికించారు. గుర్తించిన వంశీకృష్ణ ఆసుపత్రి వైద్యుడు నాగార్జునను నిలదీశారు. సిబ్బందితో పొరపాటు జరిగిందని, బాలుడికి ఏమీ కాదని, ఏమైనా జరిగితే బాధ్యత వహిస్తానని వైద్యుడు నచ్చజెప్పారు. ఇతనిపై బాధిత తండ్రి అఐజ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం పట్టణంలో శుక్ర వారం చర్చనీయాంశంగా మారింది. ఎస్సై నరేశ్ కుమార్ మాట్లాడుతూ ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. అయితే ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రి వర్గాల తీరు పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed