- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: ఆర్టీసీ బస్సుల్లో మూడో కన్ను.. పోకిరీల వెకిలి చేష్టలకు చెక్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ బస్సుల్లో హైటెక్ నిఘా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ బస్సుల్లో హైటెక్ నిఘా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల రక్షణ కోసం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సీసీ కెమెరాలను బస్సుల్లో ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగానే 'బస్సులో భరోసా' పేరుతో రూపొందించిన సరికొత్త పైలట్ ప్రాజెక్ట్‌ను ఆదిలాబాద్ జిల్లాలో సంస్థ ఉన్నతాధికారులు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (VC & MD) వై. నాగిరెడ్డి, ఐపీఎస్ మాట్లాడుతూ.. ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణ అనుభూతిని అందించడమే ఆర్టీసీ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. "ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు, కాలేజీ విద్యార్థినులు, చిన్నారుల రక్షణ కోసం ప్రత్యేక దృష్టి సారించాం. బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా పోకిరీల వేధింపులకు, పిక్‌పాకెటింగ్ (జేబుదొంగతనాలు), చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు" అని ఆయన పేర్కొన్నారు.
ఆదిలాబాద్‌లోనే తొలి అడుగు..
ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద తొలి విడతగా ఆదిలాబాద్ జిల్లాలో నడుస్తున్న సుమారు 175 ఆర్టీసీ బస్సుల్లో ఈ నిఘా కెమెరాలను అమర్చారు. డ్రైవర్ సీటుకు సమీపంలో అమర్చిన ఈ కెమెరాల ద్వారా బస్సు లోపల జరిగే ప్రతి కదలికను స్పష్టంగా రికార్డు చేస్తారు. పోలీస్ శాఖ సమన్వయంతో ఆర్టీసీ ఈ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలు మరియు పనితీరును పరిశీలించిన అనంతరం.. 'బస్సులో భరోసా' పథకాన్ని త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల పరిధిలోని బస్సులకు విస్తరిస్తామని ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఈ సీసీ కెమెరాల నిఘా ఒక బలమైన ‘రక్షణ కవచం’లా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.






