- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణలోని ఎన్నికలకు స్పూర్తి.. ఢిల్లీ ఫలితాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ (Telangana)లోని జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections)కు ఇది స్పూర్తినిస్తుందని ఢిల్లీ ఎన్నికల ఫలితాలను (Delhi Election Results) ఉద్దేశించి కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ (BJP Party) సంచలన విజయం సాధించింది. దీంతో తెలంగాణలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం (BJP State Office)లో ఘనంగా సంబరాలు (Celebrations) జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ డా. కే. లక్ష్మణ్ (MP K.Lakshman) సహా బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంబరాల సందర్భంగా కిషన్ రెడ్డి ప్రత్యేక ట్వీట్ చేస్తూ.. కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.
దీనిపై ఆయన.. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీజేపీ సంబరాల్లో ఎంపీ డా.లక్ష్మణ్, సీనియర్ బీజేపీ నేతలు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నానని తెలిపారు. అలాగే ఈ విజయం ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) నీతివంతమైన పాలనకు నిదర్శనమని చెప్పారు. ఇక ఈ విజయం తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు స్పూర్తినింపుతుందని కిషన్ రెడ్డి అన్నారు. కాగా ఉత్కంఠగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. గతంలో ఢిల్లీని ఏలిక కాంగ్రెస్ (Congress) ఖాతా కూడా తెరవకుండా మరోసారి ఘోరంగా విఫలమైంది.
మూడు పర్యాయాల పాటు అధికారంలో ఉన్న ఆప్ (APP) చతికిలపడి 22 స్థానాలకు పరిమితమైంది. దీంతో ఢిల్లీ సీఎం అతిషి రాజీనామా చేయనున్నారు. ఇక బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరా? అనే దానిపై తర్జనబర్జన పడుతోంది. ప్రధానంగా పర్వేష్ సాహిబ్ సింగ్ పేరు వినిపిస్తున్నా.. మరి కొంత మంది బీజేపీ నేతలు తాము ఎందుకు అర్హులం కాదు అన్నట్లు ఉన్నారని టాక్ వినిపిస్తోంది. బీజేపీ అభ్యర్థి పేరును ఖరారు చేసేందుకు గెలిచిన ఎమ్మెల్యేలతో ఈ సాయంత్రం ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా సమావేశం కానున్నారు. బీజేపీ లోన మరికొందరు పెద్దలు కూడా ఈ సమావేశానికి హజరు కానున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ సాయంత్రమే ఢిల్లీ సీఎం పేరును ప్రకటించే అవకాశం లేకపోలేదు.