- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NLG: వరి నాట్లతో సీపీఐఎం నేతల వినూత్న నిరసన
గుంతల మయంగా మారిన రోడ్లను బాగుచేయాలని సీపీఐఎం నేతలు మేడి గణేష్, గుండాల ప్రసాద్ డిమాండ్ చేశారు.

దిశ, రామన్నపేట: గుంతల మయంగా మారిన రోడ్లను బాగుచేయాలని సీపీఐఎం నేతలు మేడి గణేష్, గుండాల ప్రసాద్ డిమాండ్ చేశారు. శనివారం ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో గుంతలమయంగా మారిన రోడ్లపై నాటు వేసి నిరసన తెలిపారు. దుబ్బాక గ్రామంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయని.. అధికారులు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రామన్నపేట - అమ్మనబోలు రోడ్డు వర్షాకాలంలో దారుణంగా మారుతుందని.. నడవటానికి కూడా వీళ్లేకుండా ఉంటుందని ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయంపై అనేకసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందని అంటున్నారు. వెంటనే అధికారులు నూతన రోడ్డు వేసి దుబ్బాక ప్రజల బాధలు తీర్చాలని డిమాండ్ చేశారు. లేకపోతే రామన్నపేటలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎం నాయకులు గట్టు నరసింహ, పైళ్ళ పాపయ్య, డీవైఎఫ్ఐ నాయకులు గుండాల నరేష్, గుండాల అనిల్, పుట్టల ఉదయ్ కుమార్, గాదె రాజకుమార్, గట్టు సుందర్, పైళ్ల లింగస్వామి, గుండాల అక్షిత, గట్టు రమణ, గుండాల సాయి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






