- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టేషన్ ఘనపూర్ లో ఫ్లెక్సీలతో కడియం శ్రీహరికి వినూత్న నిరసన
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వినూత్న నిరసన ఎదురవుతోంది. తిరుమల దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ శ్రీకారం ఉండగా ఆ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ప్లెక్సీలో కడియం ఫోటోలను వేశారు.

దిశ, వెబ్ డెస్క్: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వినూత్న నిరసన ఎదురవుతోంది. తిరుమల దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ శ్రీకారం ఉండగా ఆ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ప్లెక్సీలో కడియం ఫోటోలను వేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం సుస్వాగతం అంటూ ప్లెక్సీలో పేర్కొన్నారు. అయితే ఆ ప్లెక్సీలను తొలగించాలని మున్సిపల్ సిబ్బంది, పోలీసులు ప్రయత్నించగా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కడియం శ్రీహరి తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పీకర్ కు లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారని చెప్పేలా ప్లెక్సీను ఏర్పాటు చేశారు. కడియం బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారని బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించి ఆయనపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కడియం మాత్రం తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని చెప్పుకుంటున్నారు.






