- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బడ్జెట్’లో తెలంగాణకు అన్యాయం: భట్టి విక్రమార్క
యూనియన్ బడ్జెట్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర బడ్జెట్‍లో (Budget) తెలంగాణకు కేటాయింపులు చేయకపోవడం దారుణం అని, కేంద్రం తీరు చాలా నిరాశపరిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) అన్నారు. ఇవాళ ప్రజాభవన్‍లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రానికి బడ్జెట్‍లో కేటాయింపులు చేయాలని పలు మార్లు కేంద్రాన్ని కోరినా కేటాయింపులు చేయలేదని విమర్శించారు. ఎలక్ట్రానిక్స్ రంగానికి రూ. 47 కోట్లు ఇస్తున్నామని బడ్జెట్‍లో పేర్కొన్నారు. కానీ ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాద్.. అయినా నగరాన్ని విస్మరించారని దుయ్యబట్టారు. హైదరాబాద్ నగరం ఫార్మా రంగారానికి ప్రసిద్ధి అని కోవిడ్ సమయంలో కీలక ఔషధాలను ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ఎగుమతి చేసిందని గుర్తు చేశారు. ఫార్మా రంగంలోనూ బడ్జెట్‍లో రాష్ట్రానికి ప్రాధాన్యత దక్కలేదన్నారు. క్రీడారంగంలోనూ తెలంగాణకు అన్యాయమే జరిగిందని క్రీడా రంగంపైనా తెలంగాణ చాలా ఫోకస్ పెట్టి క్రీడలను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించామన్నారు. ఆరెంజ్ ఎకానమీలో హైదరాబాద్ సెంట్రిక్, దాన్ని కూడా ముంబైకి తరలించారని విమర్శించారు.
ప్రజలు అంతా గమనిస్తున్నారు:
సెమీ కండక్టర్ల పరిశ్రమలకు తెలంగాణ ఎంతో అనుకూలంగా ఉందని తెలంగాణకు ఈ పరిశ్ర ఒక్కడైనా కేటాయించాలని మోడీని ఎన్నో సార్లు అడిగామన్నారు. ఎన్ని సార్లు అడిగినా సెమీ కండక్టర్ల పరిశ్రమ విషయంలో తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. పేరు మార్చి ఉపాధి హామీ పథకాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. బడ్జెట్‍లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఈ అన్యాయాన్ని పార్లమెంట్ లోప్రశ్నించాలని నిర్ణయించామన్నారు. కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి మరోసారి విజ్ఞప్తి చేస్తారు. ద్రవ్యలోటు పరిమితిని 4 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశామన్నారు. ద్రవ్యలోటు పరిమితిని కేంద్రం 4.3 శాతానికి పెంచుకున్నదని.. రాష్ట్రాలకు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదన్నారు. పార్టీలకు అతీతంగా కేంద్రంపై ఒత్తిడి చేయాలన్నారు. ఎకానమీ పెరగడానికి అవసరమయ్యేవి ఇవ్వలేదని విమర్శించారు.
Next Story






