TG: నర్సింగ్ పదోన్నతుల్లో మేల్ ఆఫీసర్స్‌కు అన్యా

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో నర్సింగ్ ఆఫీసర్స్ పదోన్నతుల్లో మేల్ నర్సింగ్ ఆఫీసర్స్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని 101 జీవో నర్సింగ్ ఆఫీసర్స్ స్టేట్ జేఏసీ పేర్కొంది.

TG: నర్సింగ్ పదోన్నతుల్లో మేల్ ఆఫీసర్స్‌కు అన్యా
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నర్సింగ్ ఆఫీసర్స్ పదోన్నతుల్లో మేల్ నర్సింగ్ ఆఫీసర్స్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని 101 జీవో నర్సింగ్ ఆఫీసర్స్ స్టేట్ జేఏసీ పేర్కొంది. ఈ మేరకు గురువారం కోఠిలోని నర్సింగ్ డిప్యూటీ డైరెక్టర్ ను కలసి వినతి పత్రం సమర్పించారు. ఫిమేల్ నర్సింగ్ నర్సింగ్ ఆఫీసర్లకు ప్రమోషన్స్ ఇవ్వగా మిగిలిపోయిన 105 పోస్టులను 101 జీవోను త్వరగా సవరించి న్యాయం తమకు చేయాలని కోరారు. డీడీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఫిమేల్ నర్సింగ్ ఆఫీసర్స్ కు 233 నర్సింగ్ లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేసినందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, డీఎంఈకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు రాపోలు శేఖర్, వైస్ ప్రెసిడెంట్ నెల్లి విద్యాసాగర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కోట్ల ప్రవీణ్ కుమార్, మీడియా మేనేజర్ రాథోడ్ కిరణ్ కుమార్, ఫ్లోరెన్స్ నైటింగేల్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు నక్క సూర్య కుమార్ ఉన్నారు.

Next Story