అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-05 06:45:40  IST  )

పల్లెల్లోనే కాకుండా అర్బన్ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు.

అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: పల్లెల్లోనే కాకుండా అర్బన్ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. ఇవాళ ఆయన సచివాలయం (Secretariat)లో ఇందిరమ్మ ఇళ్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక పేదలకు అనేక కార్యక్రమాలు చేపట్టామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు కేటాయించే బాధ్యత తీసుకుంటున్నామని పొంగులేటి తెలిపారు.

రాబోయే మూడేళ్లలో పల్లెలతో పాటు అర్బన్ (Urban) ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. మధ్య తరగతి (Middle Class) కుటుంబాలకు కూడా ఇళ్లు ఇచ్చేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. జీ ప్లస్ త్రీ, జీ ప్లస్ ఫోర్ విధానంలో అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.82 లక్షల ఇళ్ల నిర్మాణం, మూడు రకాల ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు.

Next Story