- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Indiramma House : పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు.. BRS కార్యకర్తకు కూడా
పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ళు(Indiramma House) అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

దిశ, వెబ్ డెస్క్ : పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ళు(Indiramma House) అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట టౌన్‌లో BRS కార్యకర్త MD నజీర్‌కు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఈ చర్య పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చూపిన నిబద్ధతను తెలియజేస్తుందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(MLA Beerla Ilayya) పేర్కొన్నారు. నేడు బీర్ల ఐలయ్య తన మార్నింగ్ వాక్‌లో భాగంగా MD నజీర్‌కు కేటాయించిన ఇందిరమ్మ ఇంటిని సందర్శించారు. ఈ సందర్భంగా... MD నజీర్, గత 10 ఏళ్ల BRS పాలనలో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అందలేదని ఆవేదన వ్యక్తం చేసాడు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 18 నెలల్లోనే తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందని, ఇందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హర్షం వ్యక్తం చేశాడు. ఈ సంఘటన, కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ భేదాలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇళ్లు అందించేందుకు కట్టుబడి ఉన్నదని సూచిస్తుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆలేరు మున్సిపాలిటీలో 160 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వాటిలో భాగంగా, 50 ఇళ్ల నిర్మాణ పనులను బీర్ల ఐలయ్య పరిశీలించారు.






