తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ‘ఇందిరమ్మ చీరల పథకం’ అప్డేట్

by Gantepaka Srikanth |

తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ‘ఇందిరమ్మ చీరల పథకం’ అప్డేట్

తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ‘ఇందిరమ్మ చీరల పథకం’ అప్డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: సిరిసిల్ల చేనేత(Sircilla Handloom) కార్మికుల చేత నేయించిన కోటి నాణ్యమైన చీరలను రాష్ట్రంలోని కోటి మంది ఆడబిడ్డలకు “ఇందిరమ్మ చీరల పథకం” కింద పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. చీరల ఉత్పత్తి, నాణ్యత, అర్హులైన ప్రతి మహిళకు చీరను పంపిణీ చేసే అంశంపై మంత్రి సీతక్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. చీరల ఉత్పత్తి బాధ్యత సిరిసిల్ల నేత కార్మికులకు అప్పగించినట్లు తెలిపారు. భారీ ఎత్తున ఉత్పత్తికి సమయం పట్టే అవకాశం ఉన్నందున రెండు దశల్లో పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. మొదటి విడతగా ఇందిరాగాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 19 (బుధవారం) ఈ పథకాన్ని తొలుత గ్రామీణ మహిళలకు పంపిణీతో ప్రారంభించాలని డిసైడ్ అయినట్లు వెల్లడించారు.

తెలంగాణ తల్లి ఆవిష్కరణ దినోత్సవమైన డిసెంబర్ 9 నాటికి అర్హులైన ప్రతి గ్రామీణ మహిళకు ఈ పథకం కింద చీరను అందజేయనున్నారు. ఇక పట్టణ ప్రాంత ఆడబిడ్డల కోసం మార్చి 1, 2026 నాడు మలి విడత పంపిణీ ప్రారంభించి.. అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8 నాటికి పంపిణీ పూర్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ట్వీట్

Next Story