- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Govt: ఇందిరమ్మ ఇళ్లు కోసం అప్లై చేశారా?.. ఇలా చెక్ చేసుకోండి
రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి భారీ స్పందన వచ్చింది. ఇప్పటి వరకు మొత్తంగా దాదాపు 80,54,554 అప్లికేషన్లు రాగా, ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి భారీ స్పందన వచ్చింది. ఇప్పటి వరకు మొత్తంగా దాదాపు 80,54,554 అప్లికేషన్లు రాగా, ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు దారుల ఇళ్లకు వెళ్లి యాప్‌లో వివరాలు నమోదు చేశారు. జిల్లాలలో కలెక్టర్లు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామాలు, మున్సిపాలిటీలలో ప్రతి 500 ధరఖాస్తులకు ఒక సర్వేయర్‌ను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీల్లో సర్వేయర్లుగా వార్డు అధికారి, బిల్ కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయితీ కార్యదర్శి, ఉపాధి హామీ సిబ్బందిని నియమించారు. అయితే దరఖాస్తు చేసుకున్న వాళ్లలో తమ వివరాలు సరిగా నమోదు చేశారా లేదా అనే సందేహం ఉంటుంది. ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి దరఖాస్తు దారులు ఇందిరమ్మఇండ్లు వెబ్ పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://indirammaindlu.telangana.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేశారు.
వెబ్ సైట్‌లో మొదటగా ఆన్ లైన్‌లో ఇందిరమ్మ ఇండ్లు పోర్టల్ ఓపెన్ చేయగానే కుడివైపున హోం, అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తాయి. దానిలో అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేయాలి. తర్వాత అప్లికేషన్ సెర్చ్ ఓపెన్ అయ్యాక అందులో ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, అప్లికేషన్ ఐడీ, ఎఫ్ఎస్ఐ కార్డు నంబర్ అనే నాలుగు ఆప్షన్లు కన్పిస్తాయి. ఇందులో ఏదైనా ఆప్షన్సెలెక్ట్చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆ వివరాలను ఎంటర్ చేసిన ధరఖాస్తుదారు వివరాలు కన్పిస్తాయి. దీంతో తమ దరకాస్తు ప్రభుత్వ వద్ద నమోదు అయిందా లేదా అనే సందేహాలు తీరుతాయి. తమ దరకాస్తు సర్వే చేసిన వారి వివరాలు కూడా అందులో ఉంటాయి. దీని ద్వారా తమ దరకాస్తు ప్రభుత్వ పరిశీలనలో ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. దీని ద్వారా పారదర్శకతకు పెద్ద పీట వేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇళ్లకు దరకాస్తులు చేసుకున్న వారు వివరాలను తెలుసుకోవచ్చు.
అప్లికేంట్ డిటెల్స్ (ధరఖాస్తు చేసుకున్న వారి వివరాలు)
1. అప్లికేషన్ నంబర్
2. డిస్ట్రిక్
3. విలేజ్
4.ఆధార్ నంబర్
5. సర్వేయర్ నేమ్
6. అప్లికేషన్ నేమ్
7. మండల్
8. మొబైల్ నంబర్
9. ఎఫ్ఎస్ సీ కార్డు నంబర్
10. సర్వేయర్ మొబైల్ నంబర్






