TG: ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల అప్డేట్

by Gantepaka Srikanth |

ఇందిరమ్మ ఇండ్ల(Indiramma Indlu) పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకు రూ.1,435 కోట్లను లబ్ధిదారులకు అందజేసినట్లు గృహ నిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతం(MD VP Gautam) ఒక ప్రకటనలో తెలిపారు.

TG: ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల అప్డేట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల(Indiramma Indlu) పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకు రూ.1,435 కోట్లను లబ్ధిదారులకు అందజేసినట్లు గృహ నిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతం(MD VP Gautam) ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం కాగా, 1.29 లక్షల ఇళ్ల పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. వాటిలో సుమారు 20 వేల ఇళ్లు గోడలు, 8,633 ఇండ్ల రూఫ్ వరకు పూర్తయ్యాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన ఇండ్లకు గృహ ప్రవేశాలు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇండ్ల నిర్మాణ పురోగతిని బట్టి, ప్రతి సోమవారం లబ్ధిదారులకు ఆధార్ నెంబర్ ఆధారంగా నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా సోమవారం 13,841 మంది లబ్ధిదారులకు రూ.146.30 కోట్లను విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

Next Story