- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ రాజ్యంలో పేదోడి ఇంటి కలను నెరవేరుస్తాం : మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ రాజ్యంలో పేదోడి ఇంటి కలను నెరవేర్చడమే లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

దిశ, నకిరేకల్ టౌన్ : పేదోడి ఇంటికలను నెరవేర్చడమే ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా ముఖ్యమంత్రి సహచర మంత్రులు అందరం కలిసి ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తున్నామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియంలో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపిక చేయబడిన ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో 93వేలు ఇల్లు మొదలుపెట్టి 66 వేలు పూర్తి చేసి 30వేలు మొండి గోడలు మిగిల్చిందన్నారు. ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రకటనలు, పబ్లిసిటీ తప్ప చేసింది శూన్యమని ఆయన విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినక ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతన నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు చొప్పున మంజూరు చేశామని ఆయన తెలిపారు.
ఇవి పూర్తి చేయాలంటే 22 వేల500 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అయిన తెలిపారు. తలతాకట్టు పెట్టేయ్యానా మూడున్నర ఏళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కటించి తీరుతామని లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని తేల్చి చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో కుల, మత, రాజకీయలకు అతీతంగా అర్హులైన పేదలను అధికారులు ఎంపిక చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి అనుమానాలు తావు లేదన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేద వాడి ఇంటి కలను నెరవేర్చి దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.లబ్ధిదారులకు నేరుగా నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు జమ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 400 నుండి 600 చదరపు గజాల లోపు ఇల్లు నిర్మించుకోవాలని ఆయన కోరారు. ప్రతి సోమవారం లబ్ధిదారుల అకౌంట్లో అమౌంట్ జమ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆయన విమర్శించారు. 8 లక్షల 19 కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్పారు. దానికి నెలకు 6,500 కోట్లు అసలు వడ్డీ కలిపి బ్యాంకులకు చెల్లిస్తున్నామని తెలిపారు.. అప్పు ఉన్న మాట వాస్తవం. అప్పు పుట్టని మాట వాస్తవం. అయినా ఎక్కడ కూడా తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
గత ప్రభుత్వం ధరణి పేరుతో పేదల భూములను లాక్కొని బిఆర్ఎస్ నాయకులకు బదిలి చేసిందన్నారు. కుట్రపూరితంగా రైతుబంధు తీసుకువచ్చి బిఆర్ఎస్ నాయకులకు మేలు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చికా పేదల భూములకు భరోసా గా భూభారత చట్టము తీసుకొచ్చామన్నారు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో 8 లక్షల,60,వేలు దరఖాస్తులు వచ్చాయని, ఆగస్టు 15 నాటికి వీటిలో న్యాయమైన వాటిని పరిష్కరించి రైతులకు స్వతంత్రాన్ని కల్పించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకించి ప్రజాపాలన ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకు ఎల్పిజి పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పరిమితిని 10 లక్షల కు పెంచామని ఆయన తెలిపారు. ఉగాది నుండి సన్నబియాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు.సంవత్సరంలోపే 60వేలం మందికి ఉద్యోగాలు ఇచ్చాము. ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, రైతు భరోసా ఇచ్చిన ఘనత తమది అన్నారు. ఎకరాకు 12000/- రైతుభరోసా పెంచామని ఆయన తెలిపారు తొమ్మిది రోజుల్లో 9000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేశామని తెలిపారు. గత ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసమే కట్టిందన్నారు. నిర్మించిన కొద్ది కాలానికి కూలిపోవడం దారుణం అన్నారు. తప్పు చేశాక శిక్ష అనుభవించక తప్పదని అన్నారు. శాంతిభద్రతలు కాపాడడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు .నల్గొండ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను గత ప్రభుత్వం పట్టించుకోలేదున్నారు..భద్రాచలంలోని రాముల వారి గుడికి వంద ఓట్లు ఇస్తామని గత ప్రభుత్వం 100 పైసలు కూడా ఇవ్వలేదున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం 85 నుండి 90 కోట్ల రూపాయలు ఇచ్చామని ఆయన తెలిపారు. నకిరేకల్ శాసనసభ్యులు కోరిన విధంగా వారం రోజుల్లో రామన్నపేట , నకిరేకల్ తహసిల్దార్ కార్యాలయాలకు భవనాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన తెలిపారు.
రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికార యంత్రాంగం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు వస్తాయన్నారు.ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నిబంధనలు సడలించాలని ఆయన కోరారు.సన్న బియ్యం,రైతు భరోసా,భీమా ,అన్నింటిపట్ల ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతున్నదని తెలిపారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టలేదని విమర్శించారు. అను నిత్యం తమ ప్రభుత్వం ప్రజల్లో ఉంటూ ప్రజా పాలనకు నాంది పలికిందన్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మాట్లాడుతూ.. స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ పిలుపునిచ్చిన గరీబీ హఠావో కు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆమె తెలిపారు. భూమి ఉన్న ప్రతి వ్యక్తికి భూ భారతి చట్టం ఒక వరం అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి వచ్చిన అన్ని దరఖాస్తులు ఆగస్టు 15 లోగా పరిష్కరిస్తామని ఆమే తెలిపారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల జాబితా తయారు చేశామని తెలిపారు.
ఇండ్లు వచ్చిన లబ్దిదారులు 30 రోజుల్లో ఇండ్లు మొదలు పెట్టాలని కోరారు. 4 విడతల్లో ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు చెల్లిస్తామని తెలిపారు.మండల స్థాయిలో స్టీల్ ,సిమెంట్ తదితరాలకు ధరల నియంత్రణ కమిటీ వేశామని పేర్కొన్నారు.. అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపిక చేయబడిన ఇందిరమ్మ ఇండ్ల 3500 లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,మందుల సామేలు, శాసనమండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమీత్, ఆర్ డి ఓ వై. అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, జెడ్పి సీఈవో శ్రీనివాసరావు, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజార్ల శంబయ్య, నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్, వ్యవసాయ కమిటీ మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు , మండలాల అధికారులు,ప్రజాప్రతి నిధులు , కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






