- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోర్‍వీలర్ ఉంటే ఇందిరమ్మ ఇండ్లకు అనర్హులా? రూల్స్ మార్చండి.. మండలిలో చైర్మన్ సూచన
ఫోర్ వీలర్ వాహనాలున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వెసులుబాటు కల్పించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Indlu Scheme) ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. అయితే ఈ సాహయం నిజమైన అర్హులకు మాత్రమే అందాలనే లక్ష్యంతో క్షేత్రస్థాయిలో కఠిన నిబంధనలు విధించారు. ఇందులో భాగంగా ఫోర్ వీలర్ వాహనాలు కలిగిన వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అనర్హులుగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో అద్దెకు, లోన్లపై ఫోర్ వీలర్ వాహనాలు తీసుకుని జీవనోపాధి కొనసాగిస్తున్న పేదలకు ఇదో పెద్ద శాపంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అ అంశంపై ఇవాళ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ (Gutha Sukhender Reddy) రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. బుధవారం మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో రెవెన్యూ, గృహ నిర్మాణ అండ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని (Ponguleti Srinivas Reddy) సభ్యులు ప్రశ్నలు అడుగుతున్న సమయంలో కలగజేసుకున్న గుత్తా సుఖేందర్.. ‘ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇచ్చిన మార్గదర్శకాల్లో ఫోర్ వీలర్ ఉన్నవారు అర్హులు కాదని చెప్పారు. కానీ టాటా ఏస్ వంటి బండ్లను అద్దెకు, లోన్లపై తెచ్చుకుని నడుపుతూ జీవనం సాగిస్తుంటారు. అయితే ఇలాంటి వాహనాలు కలిగిన వారు ఇప్పటికే బేస్‍మెంట్ల వరకు నిర్మాణాలు చేసుకున్నారు. వారిని మీరు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో వారు ఏమి తోయని పరిస్థితులో ఉన్నారని అందువల్ల ఈ గైడ్ లైన్స్ లో కచ్చితంగా మార్పులు చేయాలన్నారు. అలాగే ఈ రెండో విడతలోనైనా ఎల్-2, ఎల్-3 ఉన్న వారిని ఎల్-1 లోకి తీసుకు వచ్చే ఏర్పాట్లు చేయాలన్నారు.
ఫ్లెక్సిబిలిటీ ఇస్తాం: మంత్రి
అనంతరం మంత్రి స్పందిస్తూ.. రాష్ట్రంలోని మారుమూల గిరిజన తండాలు, గూడాల్లో గతంలో ప్రారంభమై వివిధ స్థాయిలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుంది. వివిధ నిర్మాణ దశల్లో ఉన్న ఇళ్లకు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి, లబ్ధిదారులకు అనుకూలంగా మార్పులు చేపడతామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రెండో విడత ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే మొదటి విడతలో ఇళ్ల మంజూరు జరగగా, మిగిలిన మూడు విడతలను కూడా దశలవారీగా పూర్తిచేస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నాటికి సుమారు లక్ష ఇళ్లు పూర్తి కానున్నాయి. జూన్-జులై నాటికి మొదటి విడతలో మంజూరైన మూడు లక్షల ఇళ్లలో మెజారిటీ పూర్తి అవుతాయన్నారు.






