‘ఇందిరమ్మ కుటుంబ బీమా’ చారిత్రాత్మక నిర్ణయం.. సీఎం రేవంత్ రెడ్డి

by Kema Shiva Kumar |

తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో ‘ఇందిరమ్మ కుటుంబ బీమా’ పథకాన్ని ప్రవేశపెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

‘ఇందిరమ్మ కుటుంబ బీమా’ చారిత్రాత్మక నిర్ణయం.. సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులు, పేదలు, ప్రభుత్వ ఉద్యోగుల భద్రత కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకమైన ‘ఇందిరమ్మ కుటుంబ బీమా’ పథకాన్ని ఈ ఏడాది బడ్జెట్‌లో అధికారికంగా పొందుపరిచామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే ప్రకారం గుర్తించిన కోటి 15 లక్షల కుటుంబాలకు ఈ బీమా సౌకర్యం వర్తించనుందని తెలిపారు.

దేశంలోనే మొదటిసారి..

భారతదేశంలోనే ఇలాంటి భారీ స్థాయి బీమా సదుపాయం మరే ఇతర రాష్ట్రంలోనూ లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో కుటుంబాలకు రక్షణ కల్పించేలా ఈ బీమా పథకాన్ని రూపొందించిందని అన్నారు. పేద ప్రజల కష్టాల్లో తోడుగా ఉండాలని, ఆపద సమయంలో ఏదో ఒక ఆర్థిక సాయం అందాలనే ఉన్నత ఆశయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎం రేవంత్ వెల్లడించింది.

ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.25 కోట్ల బీమా

ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషించే ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల ప్రభుత్వం తన ఉదారతను చాటుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వీరందరికీ కలిపి ఏకంగా రూ.1.25 కోట్ల భారీ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని, ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం వారికి అందుబాటులో ఉంటుందని భరోసానిచ్చారు. ఈ పథకం కింద జీవిత బీమా (Life Insurance, ప్రమాద బీమా (Accidental Insurance) రెండింటినీ ఎవరూ కాదనలేని విధంగా పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. సామాన్య కుటుంబాల్లోని సంపాదించే వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలనేదే ఈ పథకం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యమని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Next Story