- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Indira Shoban: మూర్ఖులు చేసే ఆరోపణలకు మద్దతిచ్చి.. మంత్రి సీతక్కపై విమర్శలా?
అంగన్‌వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోళ్లపై నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అంగన్‌వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోళ్లపై నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూర్ఖులు చేసే ఆరోపణలకు వంత పాడుతూ, అసత్యాలను ప్రచారం చేయడం దుర్మార్గమని ఆమె మండిపడ్డారు. మంగళవారం ఇందిరా శోభన్ మీడియాతో మాట్లాడుతూ.. 2021లో సత్యవతి రాథోడ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో, ఒక్కో అంగన్‌వాడీ మొబైల్‌ను రూ.9,342 వెచ్చించి కొనుగోలు చేశారని, అత్యంత తక్కువ ప్రమాణాలతో కూడిన ఆ మొబైల్స్ కొనుగోలులో అప్పట్లో మీరు చేసిన అవినీతి ఎంత? ఆనాడు జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా? అని సత్యవతి రాథోడ్‌ను ప్రశ్నించారు.
నిబంధనలకు విరుద్ధంగా తన సొంత కోడలిని టీజీ ఫుడ్స్ ఆర్థిక విభాగంలో నియమించుకున్నది వాస్తవం కాదా? అలాగే, వికలాంగుల శాఖలో తన దగ్గరి బంధువులకు అడ్డదారిలో ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని ఇందిరాశోభన్ గుర్తు చేశారు. తన స్వగ్రామంలోనే భూ వివాదాల్లో తలదూర్చి, పేదల భూములను కాజేసి, వాటిలో విలాసవంతమైన నివాసాలు ఏర్పాటు చేసుకున్న చరిత్ర సత్యవతి రాథోడ్‌ది అని ఇందిరాశోభన్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులు అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని, అంతులేని అవినీతికి పాల్పడిన వారు ఇప్పుడు నీతి సూత్రాలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఇందిరా శోభన్ ఎద్దేవా చేశారు. మంత్రి సీతక్కపై తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదని, మంత్రి సీతక్కపై చేసిన అసత్య ఆరోపణలు సత్యవతి రాథోడ్ వెనక్కి తీసుకోవాలని ఇందిరా శోభన్ డిమాండ్ చేశారు.






