తెలంగాణ వచ్చినా కూడా ఆంధ్రా ఉద్యోగులేనా..? కేటీఆర్‌పై ఇందిరా శోభన్ ఫైర్

by Disha Web Desk 19 |
తెలంగాణ వచ్చినా కూడా ఆంధ్రా ఉద్యోగులేనా..? కేటీఆర్‌పై ఇందిరా శోభన్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ నిర్వాకం వల్ల నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లారని ఇందిరా శోభన్ ఫైర్ అయ్యారు. ప్రవేశ పరీక్ష పేపర్లు లీక్ చేసి వారి మానసికస్థితిని గందరగోళానికి గురి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సీబీఐ ఎంక్వైరీకి ఆమె డిమాండ్ చేశారు. ఈ వ్యవహారమై ఇందిరా శోభన్ మంత్రి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కేటీఆర్ పీఆర్సీ నివేదిక ప్రకారం 1.21 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి, ఇప్పటివరకు 80,000 పోస్టులు కూడా భర్తీ చేయలేదన్నారు.

లూపులతో నోటిఫికేషన్లు, ఏదో ఓ కారణంతో కోర్టు మెట్లు ఎక్కడం, ప్రశ్నాపత్రాలు లీక్ అవడంతో, దరఖాస్తుల పేరిట కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానా పెంచుకోవడం తప్పా, ఉద్యోగాలు ఇచ్చే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని అర్థమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరానికి చెందిన పులిదిండి ప్రవీణ్ (32) బీటెక్ పూర్తి చేసి, టీఎస్పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. ఈ కొలువు ఇతనికి ఎలా వచ్చింది? అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చినా కూడా ఆంధ్రా ఉద్యోగులేనా కేటీఆర్ అని ఇందిరా శోభన్ నిలదీశారు. ఈ సందర్భంగా పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ టీఎస్పీఎస్పీ చైర్మన్ రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక ముందు ఇలాంటి చర్యలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.

Next Story

Most Viewed