- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం తిరుమలలో ఆమె శ్రీవారి దర్శనం పూర్తి చేసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం రేణిగుంట (Renigunta) విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి హైదరాబాద్‌కు వచ్చారు. రాజ్‌భవన్‌లో భోజనం చేసి, అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు బొల్లారం రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు. హైదరాబాద్‌లో రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో గవర్నర్, సీఎంతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, హైదరాబాద్ సీపీ సజ్జనార్ తదితరులు ఉన్నారు. రేపు ద్రౌపది ముర్ము ఉదయం 9:30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి పుట్టపర్తికి వెళ్లనున్నారు.






