- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC Kavita కు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ఆహ్వానం
ఎమ్మెల్సీ కవితకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ కవితకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందింది. జనవరి 2 , 3న కేరళలో ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నారు. జనవరి 2 మరియు 3వ తేదీల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేరళలో పర్యటించనున్నారు. కేరళలోని కన్నూరులో జరిగే ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు కల్వకుంట్ల కవితకు ఆహ్వానం పలికారు. 2వ తేదీ సాయంత్రం జరగనున్న సాంస్కృతిక ఉత్సవాలకు కవిత ముఖ్య అతిథిగా హాజరవుతారు. 3వ తేదీన సంస్కృతిపై జరిగే చర్చలో పాల్గొంటారు. ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ సమావేశాలను కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.
Also Read...
Next Story






