హైపర్ సోనిక్ టెక్నాలజీలో భారత్ అధ్బుతం.. ప్రపంచంలోనే నంబర్ 1

by Ajay Maddhiboyina |

హైప‌ర్ సోనిక్ టెక్నాల‌జీలో భార‌త్ చ‌రిత్ర సృష్టించింది. హైద‌రాబాద్ లోని డీఆర్‌డీఎల్ కేంద్రంలో భూ ఉపరితలంపై విజయవంతంగా

హైపర్ సోనిక్ టెక్నాలజీలో భారత్ అధ్బుతం.. ప్రపంచంలోనే నంబర్ 1
X

దిశ, వెబ్ డెస్క్: హైప‌ర్ సోనిక్ టెక్నాల‌జీలో భార‌త్ చ‌రిత్ర సృష్టించింది. హైద‌రాబాద్ లోని డీఆర్‌డీఎల్ కేంద్రంలో భూ ఉపరితలంపై విజయవంతంగా స్క్రామ్ జెట్ ఇంజిన్‌ను వెయ్యి సెకన్ల కంటే ఎక్కువసేపు మండించినట్టు తెలిపింది. దీని ద్వారా సుదూర లక్ష్యాలను చేధించే నెక్స్ట్ జనరేషన్ హైపర్ సోనిక్ మిసైల్స్ తయారు చేయవచ్చని పేర్కొంది. అదే జరిగితే హైపర్ సోనిక్ మిసైల్స్ తయారీలో భారత్ నంబర్ 1 స్థానంలోకి వస్తుంది.

ఈ మిసైల్స్ 6100 కేఎంపీహెచ్ వేగంతో దూసుకెళ్లగవని తెలిపింది. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఏ క్షణం యుద్దం మొదలవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. భారత్ నుండి పాక్ పౌరులు వెళ్లిపోవాలని ప్రధాని మోడీ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పాక్ పౌరులు ఇంటిబాట పట్టారు. మరోవైపు పాకిస్థాన్ లోని భారతీయులు కూడా సొంతగడ్డకు వస్తున్నారు. ఈ క్రమంలో యుద్దం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Next Story