AMCA: అమ్కా యుద్ధ విమానాల ఉత్పత్తికి రక్షణశాఖ గ్రీన్ సిగ్నల్

by Prasad Jukanti |   (  Updated:2025-05-27 05:32:47  IST  )

అమ్కా యుద్ధ విమానాల ఉత్పత్తికి రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

AMCA: అమ్కా యుద్ధ విమానాల ఉత్పత్తికి రక్షణశాఖ గ్రీన్ సిగ్నల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు చైనా నుండి పెరుగుతున్న ముప్పు నేపథ్యంలో అడ్వాన్స్ డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాప్ట్ లను (అమ్కా) (AMCA Plane) దేశీయంగా ఉత్పత్తి చేయడానికి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) అనుమతి మంజూరు చేశారు. పరిశ్రమ భాగస్వామ్యంతో ఉత్పత్తి కార్యక్రమాన్ని ఏరోనాటికల్ డెవెలప్ మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధమైంది. దీంతో స్వదేశీ నైపుణ్యాల వినియోగంలో కీలక మైలురాయిగా ఈ ఉత్పత్తి ప్రక్రియ మారనుంది. ఎగ్జిక్యూషన్ మోడల్ విధానం ప్రైవేట్, ప్రభుత్వ రంగాలకు పోటీ ప్రాతిపదికన సమాన అవకాశాలను లభించనున్నాయి. స్వతంత్రంగా లేదా జాయింట్ వెంచర్‌లుగా లేక కన్సార్టియాగా బిడ్ చేయవచ్చు. ఎంటిటీ/బిడ్డర్ దేశ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఉండే భారతీయ కంపెనీ అయి ఉండాలి అని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది.

హైదరాబాద్ లో ఫ్యాబ్రికేషన్:

దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఐదో తరం యుద్ధ విమానాం ఏఎంసీఏ-అమక్కా ను ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా -2025 లో తొలిసారి ప్రపంచానికి చూపించారు. కృత్రిమ మేధ ఆధారిత ఎలక్ట్రానికి పైలట్, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థల వంటి ప్రత్యేకతలు ఈ విమానం సొంతం. లక్ష్యాన్ని గుర్తించేందుకు తనకు తాను స్వంతంగా పని చేస్తుంది. 25 టన్నుల బరువు ఉండే ఈ లోహ విహంగం మానవ సహితంగా,మానవ రహితంగా పని చేసేలా డిజైన్ చేశారు. బెంగళూరులోని డీఆర్ డీవో-ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ దీని డిజైన్ రూపొందించగా హైదరాబాద్ కు చెందిన వేమ్ టెక్నాలజీస్ లిమిటెట్ సంస్థ ఫ్యాబ్రికేషన్ పనుల చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఈ యుద్ధ విమానం సమర్థవంతంగా తన సత్తాను చాటుతుంది.

Next Story