ఈ నెల 14 నుండి కరెంటోళ్ల నిరవధిక సమ్మె

by velandi.Saikiran |

విద్యుత్​శాఖ లో మరో సారి సమ్మె హారన్​మోగనుంది. ఈ నెల 14 ఉదయం 6.00 గంటల నుండి కరెంటోళ్ల నిరవధిక సమ్మెకు

ఈ నెల 14 నుండి కరెంటోళ్ల నిరవధిక సమ్మె
X

ఈ నెల 14 నుండి కరెంటోళ్ల నిరవధిక సమ్మె

== సమ్మెపై స్పందించాలని డిప్యూటీ సీఎంకు వినతులు

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యుత్​శాఖ లో మరో సారి సమ్మె హారన్​మోగనుంది. ఈ నెల 14 ఉదయం 6.00 గంటల నుండి కరెంటోళ్ల నిరవధిక సమ్మెకు పూనుకోనున్నారు. ఆర్టిజన్స్​ను కన్వర్షన్​చేయాలని, ఒకే సంస్థ, ఒకే సర్వీస్​రూల్స్​అమలు డిమాండ్​తో తెలంగాణ విద్యుత్​ఆర్టిజన్స్​కన్వర్షన్​జేఏసీ ఈ మేరకు విద్యుత్​శాఖ నిరవధిక సమ్మెకు పిలుపు నిచ్చింది.

ఒక వైపు కేంద్ర ప్రభుత్వం విద్యుత్​సంస్థల ప్రైవైటీకరణ దిశగా పలు రాష్ట్రాలలో ముందుకు వెళుతోందని, దీనికి కొనసాగింపుగా అన్నట్లు తెలంగాణ రాష్ర్టంలోనూ ఆర్టిజన్​ఉద్యోగుల సమస్యలకు ఏ మాత్రం స్పందించకుండా అధికారులను అప్రమత్తం చేస్తు ఉన్నతాధికారుల ఫోన్​నెంబర్లను వినియోగదారుల చెంతకు చేరుస్తున్నారని యూనియన్​సంస్థలు మండిపడుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి ఆర్టిజన్​ఉద్యోగుల కన్వర్షన్​విషయంలో సహకారం అందించాలని డిప్యూటీ సీఎం, విద్యుత్​శాఖ మంత్రి భట్టి విక్రమార్కను కోరుతున్నారు.

Next Story