IND Vs WI: వెస్టిండీస్‌తో రెండో టెస్ట్.. టాస్ గెలిచిన టీమిండియా

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-10 04:03:32  IST  )

రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య రెండో టెస్టు ఢిల్లీ (Delhi)లోని అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium)లో జరగనుంది.

IND Vs WI: వెస్టిండీస్‌తో రెండో టెస్ట్.. టాస్ గెలిచిన టీమిండియా
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య రెండో టెస్టు ఢిల్లీ (Delhi)లోని అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium)లో జరగనుంది. ఈ మేరకు టాస్‌ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. కాగా, అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా, విండీస్ జట్టుపై ఇన్సింగ్స్ 140 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0తో లీడ్‌లో నిలిచింది. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తే సిరీస్ భారత్ వశం కానంది.

భారత జట్టు: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

వెస్టిండీస్ జట్టు: ఓహ్న్ కాంప్‌బెల్, టాగెనరైన్ చందర్‌పాల్, అలిక్ అథనాజ్, షాయ్ హోప్, రోస్టన్ చేజ్(కెప్టెన్), టెవిన్ ఇమ్లాచ్(వికెట్ కీపర్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖారీ పియరీ, ఆండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్

Next Story