తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. ఎల్లో అలర్ట్ జారీ!

by velandi.Saikiran |

హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాబోయే రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. ఎల్లో అలర్ట్ జారీ!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమ క్రమంగా పెరుగుతోంది. దీపావళి తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గిపోయి, చలి తీవ్రత పెరుగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాబోయే రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ఈ రెండు రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

కనిష్ట ఉష్ణోగ్రతలు నాలుగు నుంచి ఐదు డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు కూడా వెల్లడించింది. అదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆసిఫాబాద్ లాంటి జిల్లాల్లో చలి గాలులు వీస్తాయని కూడా పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. అటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా చలి తీవ్రత విపరీతంగానే ఉంది. ఉదయం 9 గంటలు అయినా కూడా చలి తీవ్రత తగ్గడం లేదు.

Next Story