- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ ద్వారా రెవెన్యూ పెంచండి : మంత్రి పొన్నంఆర్టీసీ ద్వారా రెవెన్యూ పెంచండి : మంత్రి పొన్నం
మహాలక్ష్మీ పథకం వచ్చిన తర్వాత సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ క్రమక్రమంగా లాభాల బాటలోకి వస్తున్నా... ప్రభుత్వం నుండి నెల వారిగా వస్తున్న మహాలక్ష్మి టికెట్ ఆదాయమే కాకుండా అదనపు ఆదాయంపైనా దృష్టి సాధించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మహాలక్ష్మీ పథకం వచ్చిన తర్వాత సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ క్రమక్రమంగా లాభాల బాటలోకి వస్తున్నా... ప్రభుత్వం నుండి నెల వారిగా వస్తున్న మహాలక్ష్మి టికెట్ ఆదాయమే కాకుండా అదనపు ఆదాయంపైనా దృష్టి సాధించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బుధవారం సచివాలయంలో మంత్రి ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు మహిళలాలు 237 కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకుని,,. రూ.7980 కోట్లను ఆదా చేసుకున్నారని తెలిపారు.
ఈ డబ్బును ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. టికెట్ ఆదాయంతో పాటు టికెటేతర ఆదాయంపైనా దృష్టి సారించాలన్నారు. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్లలో, టిమ్ మిషన్ల ద్వారా వచ్చే టికెట్ పై ప్రకటనల ద్వారా ఆదాయాన్ని మరింత పెంచాలన్నారు. ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్న తాండూరు, వికారాబాద్, బీహెచ్ఈఎల్, మియాపూర్, కుషాయిగూడ, దిల్ సుఖ్ నగర్, హకీంపేట్, రాణీగంజ్, మిథానితో పలు పలు డిపోల నష్టాలకు కారణాలు, లాభాల బాట పట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ వేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని మంత్రి ఆదేశించారు.
నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. నగరంలో ఇప్పటికే 500 వరకు ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నందున పీఎం ఈ -డ్రైవ్ కింద హైదరాబాద్ కి కేటాయించిన 2 వేల బస్సులు విడతల వారిగా రానుండడంతో అందుకు సంబంధించిన చార్జింగ్ స్టేషన్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. నగరంలో కొత్త కాలనీలకు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. కొల్లూరు వద్ద డబుల్ బెడ్ రూం కాలనీలో నివసిస్తున్న వేలాది మందికి రవాణా సౌకర్యాలు కల్పించడానికి డిమాండ్ కు అనుగుణంగా కొత్త రూట్ లను రూపొందించాలన్నారు.
ఈ ఏడాది 578 కొత్త బస్సులు రోడ్డెక్కాయన్నారు. త్వరలో మరిన్ని కొత్త బస్సులు రానుండడంతో వాటిని ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ప్రాంతాల్లో నడిపించాలని సూచించారు. ఇప్పటికే ఆర్టీసీ లో 1000 ఆర్టీసీ డ్రైవర్లు ,743 శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని... ఈ ఏడాది చివరి నాటికి 84 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ,114 సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుందన్నారు. కారుణ్య నియామకాల కింద చేరిన ఆర్టీసీ కండక్టర్లకు ఉన్న మూడేళ్ల ప్రొవిజన్ ను రెండేళ్లకు తగ్గించేలా పరిశీలించాలని అధికారులకు సూచించారు.
మేడారం జాతర సమీపిస్తుండటంతో ములుగు బస్ స్టేషన్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏటూరు నాగారం, పెద్దపల్లి బస్సు డిపో పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. పుష్కరాలు వచ్చే లోపు మంథని బస్ స్టేషన్ ఆధునీకరణ పూర్తి కావాలన్నారు. మధిర బస్ స్టేషన్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. హుజూర్ నగర్, కోదాడ బస్ స్టేషన్ల శంకుస్థాపన వారం రోజుల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మిర్యాలగూడ అప్ గ్రేడేషన్ పనులు ప్రారంభించాలన్నారు.
ఫోర్త్ సిటీలో బస్ టెర్మినల్...
ఫోర్త్ సిటీ లో బస్ టెర్మినల్ నిర్మాణం, బస్ సౌకర్యాలపై ఆర్టీసీ ఉన్నతాధికారులు అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో నలువైపులా బస్ స్టేషన్ లు ఉండేలా జెబిఎస్ మాదిరి ఆరంఘర్ లో అధునాతన బస్సు టెర్మినల్ నిర్మించడానికి ఆర్టీసీ, పోలీస్ శాఖకి సంబంధించిన భూ బదలాయింపు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉప్పల్ లో కూడా టెర్మినల్ నిర్మించడానికి అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. రవాణా శాఖ సీజ్ చేసిన వాహనాలు బస్సు డిపోలలో చాలా కాలంగా పేరుకుపోవడంతో వారికి సమయం ఇచ్చి యాక్షన్ వేయాలని సూచించారు.
ఆర్టీసీలో ప్రమాదాలను తగ్గించడానికి తొలి దశలో లహరి, రాజధాని, గరుడ బస్సుల్లో అమలవుతున్న డ్రైవర్ మానిటరింగ్ సిస్టం పని తీరును అడిగి తెలుసుకున్నారు. దీని ద్వారా డ్రైవర్ నిద్రకు ఉపక్రమించే సూచనలు కానీ, మొబైల్ వాడుతున్నప్పుడు మానిటరింగ్ చేస్తూ అప్రమత్తం చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగులతో జూమ్ సమావేశం నిర్వహిస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆర్టీసీ మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు అద్దె ప్రాతిపదికన నడిపించాలని సెర్ఫ్ తో ఒప్పందం చేసుకుంటే... ఇప్పటి వరకు 150 బస్సులు మహిళా సంఘాలు, ఆర్టీసీతో సంయుక్తంగా నడుస్తున్నాయన్నారు. మిగిలిన 450 బస్సులు కూడా మహిళా సంఘాల ద్వారా తీసుకోవాలని ఆదేశించారు.
గత ఏడాది మేడారం జాతర కోసం 3490 బస్సులు నడపగా 16.83 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారని... ఈసారి జాతర కు 20 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణిస్తారని అంచనా వేసి 3800 బస్సులు నడపడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు. సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






