- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Telangana Elections: మేజర్ పంచాయతీలో తెలుగుదేశం అభ్యర్థి విజయం
తెలంగాణ పల్లె పోరులో ఖమ్మం జిల్లా కామేపల్లి మేజర్ పంచాయతీలో తెలుగుదేశం అభ్యర్థి విజయం సాధించారు..

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో(Telangana Panchayat elections) టీడీపీ(Tdp) అభ్యర్థులు పోటీ చేసిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా(Kammam District) ఎన్నికల ఫలితాల్లో పలు పంచాయతీల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ప్రధానంగా కామేపల్లి మేజర్ పంచాయతీలో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. సర్పంచ్‌గా టీడీపీ మద్దతు అజ్మీరా హరి విజయం సాధించారు. దీంతో టీడీపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెండు విడత ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్నాయి. ఈ విడతలో 4332 పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం రాత్రి 10 వరకూ మొత్తం 4100 చోట్ల ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. కాంగ్రెస్ 2126, బీఆర్ఎస్-1121, బీజేపీ-245, ఇతరులు -610 మంది అభ్యర్థులు విజయం సాధించారు.
Next Story






