వచ్చే ఎన్నికల్లో వంద కొట్టి.. BRSను బొంద పెడుతం: విప్ బీర్ల ఐలయ్య హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు కొట్టి.. బీఆర్ఎస్ (BRS) పార్టీని రాష్ట్రంలో లేకుండా బొంద పెడుతామని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Beelra Ilaiah) అన్నారు.

వచ్చే ఎన్నికల్లో వంద కొట్టి.. BRSను బొంద పెడుతం: విప్ బీర్ల ఐలయ్య హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు కొట్టి.. బీఆర్ఎస్ (BRS) పార్టీని రాష్ట్రంలో లేకుండా బొంద పెడుతామని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Beelra Ilaiah) అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి విసిరిన సవాలుపై ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి ఇటీవల ఓ సభలో చెప్పినట్లుగా వంద సీట్లను విజయం సాధిస్తామని అన్నారు. ఇప్పటి నుంచి తమ నినాదం ‘వంద కొడదాం.. బీఆర్‌ఎస్‌ను బొంద పెడదాం’ అని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఇంకా అహంకారం, బలుపు ఏమాత్రం తగ్గలేదని ఫైర్ అయ్యారు.

అసెంబ్లీలో చర్చకు రమ్మంటే కేసీఆర్ (KCR) రావడం లేదని.. ఎన్నికల్లో ప్రజలు ఛీకొడితే ఫామ్‌ హౌస్‌, గెస్ట్‌ హౌస్‌లకు పరిమితమైన మీతో సీఎం రేవంత్ రెడ్డితో పోటీ ఏంటని ఎద్దేవా చేశారు. ఓ వైపు అభివృద్ధి పనులు చేపడుతూనే.. మరోవైపు సమర్ధవంతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరు చూసి బీఆర్ఎస్ కడుపు మండి అర్థంలేని ఛాలెంజ్‌లు చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల కాలంలో దోచుకున్న, దాచుకున్న డబ్బుతో పింక్ మీడియా (Pink Media)ను అడ్డు పెట్టుకుని ప్రభుత్వాన్ని బద్‌నాం చేయాలని చూస్తున్నారని.. కేటీఆర్ తస్మాత్ జాగ్రత్త అంటూ ధ్వజమెత్తారు. మీ పద్ధతి ఇలానే కొనసాగితే.. రాబోయే రోజుల్లో మ్మిమ్మల్ని జనం రాళ్లతో కొట్టుడు ఖాయమని బీర్ల ఐలయ్య అన్నారు.

Next Story