Panchayathi Elections : పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ పై కీలక అప్డేట్

by Muthe.Rajitha |

తెలంగాణ(Telangana)లో స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections)పై కీలక అప్డేట్ వెలువరించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy).

Panchayathi Elections : పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ పై కీలక అప్డేట్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections)పై కీలక అప్డేట్ వెలువరించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy). అతి త్వరలోనే పంచాయితీ(Panchayithi Elections), మున్సిపల్ ఎన్నికలు(Muncipal Elections) రానున్నాయి.. అంతా సిద్ధంగా ఉండాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈనెల 15లోపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్లు ఆయన కీలక ప్రకటన చేశారు. ఇదిరమ్మ ఇళ్ళు(Indiaramma Houses) లబ్దిదారులు అందరికీ ఇస్తామని మంత్రి తెలిపారు. అలాగే రైతు భరోసా(Raithu Bharosa), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(Indiramma Athmiya Bharosa) పథకాలను అర్హులకు అందజేస్తామని అన్నారు. కొత్త రేషన్ కార్డులు పంచాయితీ ఎన్నికల లోపు అర్హత కలిగిన కుటుంబాలకు ఇస్తామని పేర్కొన్నారు. విపక్షాలు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని, క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలని సూచించారు. కాగా తెలంగాణలో కులగణన సర్వే, రిజర్వేషన్ల అంశంపై కీలక అడుగులు పడుతున్నాయి. నేడు కులగణన(Cast Census)పై కమిషన్.. కేబినెట్ సబ్ కమిటీకి తన నివేదిక అందజేసింది.

దానిని త్వరలో సిఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి అందజేసి.. ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే రిజర్వేషన్ల(Reservations) అంశం కూడా మరి కొద్దిరోజుల్లోనే కొలిక్కి రానుంది. రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పూర్తయిన తర్వాత ఏ క్షణాన అయినా స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మంత్రి పొంగులేటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నెల 15 లోపు రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పూర్తి కానున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే రాష్ట్రంలో మరో ఎన్నికల సమరానికి సిద్ధం కానున్నాయి కీలక పార్టీలు. అయితే తాము పాలనలోకి వచ్చిన ఏడాదిలోనే సాధించిన విజయాలు, చేసిన అభివృద్ది పనులతో ప్రజల్లోకి వెళ్లాలని, అధికార కాంగ్రెస్ పార్టీ చూస్తుంటే.. ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని ఎన్నికల హామీల అంశాలను ప్రజల్లోకి తీసుకు పోయి ఓట్లు సాధించాలని ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) పార్టీలు చూస్తున్నాయి.

Next Story