- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
High Court: ఆ సర్టిఫికెట్లతో తెలంగాణలో రిజర్వేషన్లు పొందలేరు
పీజీ మెడికల్ సీట్ల(PG Medical Seats)లో రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) సీజే ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: పీజీ మెడికల్ సీట్ల(PG Medical Seats)లో రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) సీజే ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు ప్రకారం ఏపీ జారీ చేసిన ఎస్సీ కులధ్రువీకరణ పత్రాలతో తెలంగాణలో రిజర్వేషన్లు పొందలేరని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఎస్సీ సర్టిఫికెట్ ఉన్నవాళ్లే రిజర్వేషన్‌కు అర్హులని పేర్కొంది. ఈ సందర్భంగా ఏజీ సుదర్శన్ రెడ్డి కోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. కాగా, ఇటీవల పీజీ మెడికల్ సీట్ల భర్తీపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. పీజీ మెడికల్ సీట్ల భర్తీలో గతంలో ఉన్న రాష్ట్ర 50 శాతం స్థానిక కోటా వర్తించదని తేల్చిచెప్పింది. పీజీ వంటి ఉన్నత వైద్య విద్య కోర్సుల రిజర్వేషన్ల విషయంలో నివాస ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు వెల్లడించింది. రాష్ట్ర కోటా సీట్లను కూడా నీట్ మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని ఆదేశించింది.






