- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ కేబినెట్ భేటీ ఎఫెక్ట్.. మరోసారి KRMB సమావేశం వాయిదా
నదీ జలాల వాటాలపై చర్చించాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) 21వ సమావేశం మరోసారి వాయిదా పడింది.

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వాటాలు, ఇతర కీలక అంశాలపై చర్చించేందుకు ప్రతిపాదించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) 21వ సమావేశం మరోసారి వాయిదా పడింది. ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాల ముందస్తు రాజకీయ, పరిపాలనా ముఖ్యాంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి 21వ బోర్డు సమావేశాన్ని మొదట ఈ నెల 14న నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, అదే రోజున ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఖరారు కావడంతో, భేటీని ఈ నెల 21కి వాయిదా వేస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నారు.
అయితే, మార్చిన తేదీ అయిన ఈ నెల 21న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. దీంతో ఈ కీలకమైన KRMB సమావేశాన్ని మరోసారి వాయిదా వేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం బోర్డును కోరింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలించిన కృష్ణా బోర్డు.. 21న జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది. సమావేశానికి సంబంధించిన తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారులకు అధికారికంగా చేరవేసింది.






