- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐబొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలన్న నిర్మాత.. "మీకు అలా జరిగితే ఆ నొప్పేంటో తెలుస్తుంది" అన్న తండ్రి
సినిమాలను పైరసీ చేస్తున్న ఐబొమ్మ, బొప్పం టీవీ వెబ్ సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవికి రోజురోజుకూ ప్రజల మద్దతు పెరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: సినిమాలను పైరసీ చేస్తున్న ఐబొమ్మ, బొప్పం టీవీ వెబ్ సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవికి రోజురోజుకూ ప్రజల మద్దతు పెరుగుతోంది. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసి, వాటి రేట్లను కూడా ఇష్టానుసారం పెంచితే థియేటర్లలో ఎవరు చూస్తారన్న వాదనకు బలం చేకూరుతోంది. ఇటీవల ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటూ టాలీవుడ్ నిర్మాత సి.కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాజాగా ఈ వ్యాఖ్యలను రవి తండ్రి అప్పారావు తీవ్రంగా ఖండించారు. సి.కల్యాణ్ ను ఎన్ కౌంటర్ చేస్తే ఆ బాధేంటో తెలుస్తుందన్నారు. తన కొడుకుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు.
ఇక సినిమాల పైరసీ గురించి మాట్లాడుతూ.. ఏ సినిమాలో అయిన కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లకు వచ్చి వీక్షిస్తారన్నారు. ఒకపుడు తాను 45 పైసలకే థియేటర్లో సినిమా చూశానని, ఇప్పుడు టికెట్ ధరలను దారుణంగా పెంచేశారని అన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎవరు సినిమాలు తీయమన్నారని ప్రశ్నించారు. ఇకనైనా చిత్రపరిశ్రమ తమ తప్పుల్ని సరిదిద్దుకోవాలని సూచించారు. తన కొడుకు తరపున వాదిస్తోన్న లాయర్కు తాను ఆర్థికంగా అండగా ఉంటానని భరోసానిచ్చారు. న్యాయపరంగానే ముందుకెళ్తామన్నారు.






