- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణపై సైక్లోన్ ఎఫెక్ట్.. 19 జిల్లాల్లో మధ్యాహ్నం 1 గంట వరకూ భారీ వర్షం
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని నరసాపురం సమీపంలో గత అర్థరాత్రి తీరం దాటిన మొంథా తీవ్ర తుపాను క్రమంగా బలహీనపడుతూ తెలంగాణ మీదుగా ఛత్తీస్ గఢ్ వైపు పయనిస్తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం మధ్యాహ్నం 1 గంట వరకూ పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఒక ప్రకటన విడుదల చేసింది.
హన్మకొండ, హైదరాబాద్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో 41-61 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురుస్తుందని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, మంచిర్యాల, మెదక్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురుస్తుందని, గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అలాగే ఒకట్రెండు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.






