- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుణుడి ఉగ్రరూపం.. తెలంగాణలో ఈ జిల్లాలకు అత్యంత భారీవర్షాల హెచ్చరిక
భారత వాతావరణ శాఖ (IMD) కొన్ని జిల్లాలకు అత్యంత భారీ వర్ష (Heavy Rain Alert) హెచ్చరిక చేసింది. ఉత్తర తెలంగాణలోని..

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా భారత వాతావరణ శాఖ (IMD) కొన్ని జిల్లాలకు అత్యంత భారీ వర్ష (Heavy Rain Alert) హెచ్చరిక చేసింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని, ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో ఎక్కడికక్కడ నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా.. తాజా హెచ్చరికలతో ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అలర్ట్ చేస్తున్నారు.






