- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెట్టింట వైరల్ అవుతున్న రాజన్న ఆలయ ఊహాచిత్రాలు.. స్పందించిన అధికారులు
వేములవాడ రాజన్న ఆలయాన్ని పునర్‌నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలో ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఊహాచిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆలయం కొత్త డిజైన్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు దర్శనం ఇస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: వేములవాడ రాజన్న ఆలయాన్ని పునర్‌నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలో ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఊహాచిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆలయం కొత్త డిజైన్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు దర్శనం ఇస్తున్నాయి. కాగా ఇప్పటి వరకు ఆలయ డిజైన్ పై అధికారులను నుండి ఎలాంటి అధికారిక ప్రకటన బయటకు రాలేదు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారడంతో అధికారులు స్పందించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆలయ ఊహ చిత్రాలు పాతవి అంటూ తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే దేశంలోని ప్రసిద్ధి చెందిన ఆలయాలలో వేములవాడ రాజన్న ఆయలం కూడా ఒకటి. ఇక్కడికి భక్తులు తరచూ వేల సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటారు. సోమవారం అయితే కిక్కిరిసిపోతుంటారు. ఈ ఆలయానికి దక్షిణకాశీ అనే పేరు సైతం ఉంది. ఇక ఈ ఆలయం వార్షిక ఆదాయం రూ.150 కోట్లు ఆపైనే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న గుడి 1200 ఏళ్ల క్రితం నిర్మించగా ఇప్పుడు మళ్లీ పునర్ నిర్మిస్తున్నారు.






