- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసత్య ప్రచారాలు చేస్తే చెప్పు తెగుద్ది.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తికి పరిటాల సునీత వార్నింగ్
ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాప్తాడు రాజకీయం రోజురోజుకు హీటెక్కుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాప్తాడు రాజకీయం రోజురోజుకు హీటెక్కుతోంది. ఉప్పు, నిప్పులా ఉండే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి (Topudurthi Prakash Reddy), ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సనీత (Paritala Sunitha) మధ్య మాటల యుద్ధం మరోసారి పీక్‌కు చేరింది. హౌసింగ్ లబ్ధిదారుల నుంచి ఎమ్మెల్యే పరిటాల సునీత రూ.10 వేలు వసూలు చేస్తున్నారని తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నిరుపేదలని కూడా చూడకుండా లబ్ధిదారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్నారని ఫైర్ అయ్యారు.
ఈ క్రమంలోనే తోపుదుర్తి చేసిన ఆరోపణలకు పరిటాల సునీత ఇవాళ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ రాప్తాడులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హౌసింగ్ లబ్ధిదారుల నుంచి తాను ఒక్క రూపాయి తీసుకున్నట్లుగా నిరూపిస్తే దేనికైనా రెడీ అంటూ సవాలు విసిరారు. కారు కూతలు కూస్తే కఠిన చర్యలు తప్పవని ఫైర్ అయ్యారు. తనపై మరోసారి అసత్య ప్రచారాలు, అబద్ధాలు చెబితే చెప్పు తెగుద్దని మాస్ వార్నింగ్ ఇచ్చారు. కడుపుకు కూడు తినేవాడు ఎవడూ అలా మాట్లాడరని అన్నారు. పది రూపాయలు జేబులోంచి తీసి నిరుపేదలకు సాయం చేసే గుణం పరిటాల కుటుంబానిదని, ఇతరుల వద్ద చేయి చాచడం తమ రక్తంలోనే లేదని సీరియస్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డే ఆ పని చేసి ఉంటాడని.. లేకపోతే ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తారని పరిటాల సునీత కౌంటర్ అటాక్ చేశారు.






