ఆ పని చేయడం ఇష్టం లేకే బీఎస్పీకి రాజీనామా.. కేసీఆర్ తో భేటీ అనంతరం ఆర్ఎస్పీ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 13 |
ఆ పని చేయడం ఇష్టం లేకే బీఎస్పీకి రాజీనామా.. కేసీఆర్ తో భేటీ అనంతరం ఆర్ఎస్పీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:బీఎస్పీ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిన పరిస్థితులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తుపెట్టుకోవడం నచ్చని మోడీ, అమిత్ షా ధ్వయం బీఎస్పీ పార్టీ మీద ఒత్తిడి తీసుకువచ్చారని అన్నారు. బీఆర్ఎస్ తో పొత్తు లేదని మీడియా సమావేశం పెట్టి చెప్పాలని తనకు ఆదేశాలు వచ్చాయని, అలా చేయడం నాకు ఇష్టం లేనందువల్లే బీఎస్పీని వీడానన్నారు. బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్పీ ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలోని బహుజన ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాన్నారు. నేను ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గను అని, అందరితో చర్చించాక భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటానన్నారు. భవిష్యత్ లో కేసీఆర్, బీఆర్ఎస్ తో కలిసి నడుస్తానని చెప్పారు.

పార్టీ ఆదేశాల మేరకే బీఆర్ఎస్ పొత్తు ప్రకటన:

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్టీ ఆదేశాలానుసారంగా గ్రామ స్థాయి నుంచి పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాతే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకుని ప్రకటించామన్నారు. కేసీఆర్ తో పలు ధపాలుగా చర్చలు జరిపామని ఇక్కడి పరిణామాలు మా పార్టీ జాతీయ నేతలకు ఎప్పటికప్పుడు తెలియజేశామన్నారు. పొత్తులో భాగంగా బీఎస్పీ కేంద్ర సమన్వయక కర్త అనుమతితో నాగర్ కర్నూల్, హైదరాబాద్ సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించామన్నారు. కానీ ఇవాళ పొత్తు రద్దు చేసుకోవాలని బీజేపీ బీఎస్పీని ఒత్తిడి చేసిందని దాంతో ఆ విషయం తననే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని నాకు ఆదేశాలు వచ్చాయన్నారు. ఒక సారి మాట ఇస్తే తప్పవద్దని, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పొత్తు ధర్మం ప్రకారం నడవాల్సిందే అన్నారు. అందుకే నేను రాజీనామా చేశానన్నారు. తెలంగాణలోని బహుజన ప్రయోజనాలు, లౌకికవాదాన్ని బతికించడం, రాజ్యాంగాన్ని రక్షించడం కోసం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తన నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు తన నిర్ణయాన్ని స్వాగతించాలని కోరారు.

Next Story

Most Viewed