- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అత్తింటి వేధింపులు భరించలేక కోడలు ఆత్మహత్య
దిశ,నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని ఆరేడు గ్రామానికి చెందిన గడ్డం స్వప్న (22) ఆత్మహత్య చేసుకున్నట్లు నిజాంసాగర్ ఎస్సై కె.సుధాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నారాయణఖేడ్ మండలంలోని ఆకుల లింగాపూర్ గ్రామానికి చెందిన స్వప్నకు నిజాంసాగర్ మండలం ఆరేడు గ్రామానికి చెందిన గడ్డం రాజుతో మూడు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం రెండు సంవత్సరాల పాప కలదు. గత కొన్ని రోజులుగా భర్త రాజు బతుకుదెరువు కోసం పెయింటింగ్ పనులు చేస్తూ హైదరాబాద్లో ఉంటున్నాడు.
భార్య స్వప్నతో పాటు అత్త రత్నవ్వ, మామ క్రీసూస్తం కలిసి ఆరేడు గ్రామంలో ఉంటున్నారు. తరచూ అత్తా మామ కలిసి కోడలును వేధిస్తుండడంతో స్వప్న గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్సై సుధాకర్ పరిశీలించి స్వప్న తల్లి జంగిలి సాయవ్వ ఫిర్యాదు మేరకు అత్తమామలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ పరిశీలించారు.