భారీగా నల్లమందు పట్టివేత…కోటి 73 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

by Disha Web Desk 11 |
భారీగా నల్లమందు పట్టివేత…కోటి 73 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
X

దిశ, రాజేంద్రనగర్: ఎక్సైజ్ పోలీసులు భారీగా నల్ల మందును పట్టుకున్నారు. కోటి డెబ్బై మూడు లక్షలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ వెల్లడించారు. శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలార్దేవ్ పల్లి డివిజన్ కాటేదాన్ బాబుల్ రెడ్డి నగర్ లోని గుట్కాలు తయారు చేసే ఓ కంపెనీపై విశ్వసనీయ సమాచారంతో గురువారం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, ఎక్సైజ్ పోలీసులు కలిసి దాడులు నిర్వహించారు. నల్ల మందును వివిధ బ్రాండ్స్ కు సంబంధించిన గుట్కా కవర్స్ లో ప్యాకింగ్ చేసి రాష్ట్రం అంతా కేటుగాళ్లు సరఫరా చేస్తున్నారు. ఒక్కో ప్యాకెట్ను మూడు వేల చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు కాటేదాన్ బాబూల్ రెడ్డి నగర్ లోని గోదాం పై దాడులు నిర్వహించిన ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ బృందం ఓ నిందితుడిని అరెస్టు చేయగా మరో వ్యక్తి పారిపోయాడు. ఓ బోలెరో వాహనం, 10 మొబైల్ ఫోన్లు సీజ్ చేసినట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ వెల్లడించారు. అజర్ అనే వ్యక్తి గోదాం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. 27 కేజీల ఓపిఎం పాపి పౌడర్, 11 కేజీల ఒపీఎం స్ట్రా హస్క్, 1000 కేజీల టొబాకో ఓపిఎం మిక్చర్ స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు ఎన్డిపి ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమావేశంలో శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ హరిప్రియ, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఇన్స్పెక్టర్ దేవేందర్ రావు, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, పలువురు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed