- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలియకుంటే తెలుసుకొని మాట్లాడాలి.. పీసీసీ చీఫ్ పై మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్
పీసీసీ అధ్యక్షుడికి తెలియకుంటే తెలుసుకొని మాట్లాడాలని, తన అజ్ఞానాన్ని ప్రజల మీద రుద్దడం సంస్కార హీనత అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (BRS Leader Singireddy Niranjan Reddy) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: పీసీసీ అధ్యక్షుడికి తెలియకుంటే తెలుసుకొని మాట్లాడాలని, తన అజ్ఞానాన్ని ప్రజల మీద రుద్దడం సంస్కార హీనత అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (BRS Leader Singireddy Niranjan Reddy) అన్నారు.పీసీసీ అధ్యక్షుడికి తెలియకుంటే తెలుసుకొని మాట్లాడాలని, తన అజ్ఞానాన్ని ప్రజల మీద రుద్దడం సంస్కార హీనత అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (BRS Leader Singireddy Niranjan Reddy) అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా ఆయన.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిది రాజకీయ అపరిపక్వత ప్రదర్శించడమేనని, తెలియకుంటే తెలుసుకోవాలని, ఇది తెలంగాణ సమాజాన్ని అవమానించడమే అని అన్నారు. ఎవరో వచ్చి తెలంగాణ ప్రజలకు వ్యవసాయం నేర్పలేదని, భారతదేశం లోనే దక్కన్ పీఠభూమి ప్రజలు, అందులో తెలంగాణ ప్రజలే అందరికంటే ముందు తమ నైపుణ్యంతో వ్యవసాయం అభివృద్ధి చేశారని తెలిపారు.
దానికి పునాదులు వేసింది విష్ణు కుండినులు, శాతవాహనులు, ప్రధానంగా కాకతీయ రెడ్డి రాజులు, అటుపిమ్మట అసఫ్ జాహీ పాలకులు అని, వెయ్యేళ్ల క్రితమే ఈ తెలంగాణ నేల వరి పండిన ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. ప్రపంచానికి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ నేర్పించింది తెలంగాణ అని, ప్రపంచపు భారీ నీటిపారుదల తొలి ప్రాజెక్టు కట్టింది తెలంగాణలో నిజాం సాగర్ అని తెలిపారు. ఇక్కడ ఉన్న వనరులు చూసి బతకడానికి అనేకమంది వలస వచ్చారని, వలసవచ్చి వారి పద్దతులలో వ్యవసాయం చేసి ఉండవచ్చు.. ఆ విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు కానీ వలస వచ్చినవాళ్లు వ్యవసాయం నేర్పారు అన్న మాటలు మాట్లాడడం తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనని మండిపడ్డారు.
జొన్నకలి జొన్నంబలి
జొన్నన్నము జొన్న పిసరు జొన్నలె తప్పన్
సన్నన్నము సున్న సుమీ
పన్నుగ పలనాటి సీమ ప్రజలందరకున్
అని శతాబ్దాల కిందటే శ్రీనాథుడు (Srinadhudu) తన రచనల్లో వర్ణించారని, తెలియకుంటే పండితులను అడిగి పీసీసీ అధ్యక్షుడు తెలుసుకోవాలని సూచించారు. కాలానుగుణంగా కేవలం సమైక్య రాష్ట్రంలో కలిసిన పాపానికి తెలంగాణ రైతులు, తెలంగాణ వ్యవసాయం చిద్రమైపోయిందని, అది మరిచి ఎవరి సంతృప్తి కోసమో ఏ రోటి దగ్గర ఆ పాట పాడే మీ అవకాశవాద రాజకీయాలను తెలంగాణ అస్థిత్వ పతాకకు రుద్ద వద్దు.. అవమానించవద్దని హెచ్చరించారు. ఇక పీసీసీ అధ్యక్షుడు బేషరతుగా తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని మాజీమంత్రి డిమాండ్ చేశారు.






