- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీకి రమ్మంటే రావు.. మా తోలు తీస్తావా: కేసీఆర్‌కు మంత్రి పొన్నం కౌంటర్
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి రమ్మంటే రారు.. కానీ మా తోలు తీస్తారా అంటూ కేసీఆర్ (KCR)పై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి రమ్మంటే రారు.. కానీ మా తోలు తీస్తారా అంటూ కేసీఆర్ (KCR)పై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్ల తర్వాత ఫామ్‌హౌస్ నుంచి వచ్చి ఏది పడితే అది మాట్లాడతామంటే ఊరుకోమని అన్నారు. తాము ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాళ్లమని అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా గౌరవమిచ్చి శాసనసభకు రమ్మంటున్నామని.. సీఎం కూడా అదే చెప్పారని అన్నారు. అసెంబ్లీ స్పీకర్ కూడా పెద్దాయనకు ఏమాత్రం గౌరవం తగ్గకుండా సభను నడుపుదామని అన్నారని తెలిపారు. శాసనసభలో జరిగే చర్చతో రాష్ట్రానికి ఎవరు ఏం చేశారో ప్రజలే తేలుస్తారని అన్నారు.
కానీ, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించి.. మళ్లీ మా తోలు తీస్తామని అనడం పద్ధతి కాదన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల పూర్తి బాధ్యత ఉందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా బలహీనంగా ఉన్న అన్ని శాఖలపై సీఎం, మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. అన్ని సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని కామెంట్ చేశారు. సంక్షేమ హాస్టళ్లకు కిరాయిలు కట్టకపోతే.. తాళాలు వేసే పరిస్థితి నుంచి పాత మెస్ బకాయిలు కట్టకపోతే కట్టుకుంటూ వస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ఏమైందో తెలుసని.. కుర్చీ వేసుకుని కట్టిస్తానని చెప్పిన గౌరవెల్లి ప్రాజెక్టు ఏమైందో అందరికీ తెలుసని మంత్రి పొన్నం ప్రభాకర్ చురకలంటించారు.






