పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేయాల్సిందే.. మాజీ మంత్రి మల్లారెడ్డి

by Kema Shiva Kumar |

పార్టీలో కొనసాగుతూ.. పార్టీ నియమాలు, విధానాలను ధిక్కరిస్తే వారు ఎంతటి వారైనా సరే నిర్ధాక్షిణ్యంగా సస్పెండ్ చేయాల్సిందేనని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) అన్నారు.

పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేయాల్సిందే.. మాజీ మంత్రి మల్లారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీలో కొనసాగుతూ.. పార్టీ నియమాలు, విధానాలను ధిక్కరిస్తే వారు ఎంతటి వారైనా సరే నిర్ధాక్షిణ్యంగా సస్పెండ్ చేయాల్సిందేనని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) అన్నారు. ఇవాళ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు‌లపై చేసిన ఆరోపణలపై మల్లారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారని కామెంట్ చేశారు. పార్టీకి నష్టం చేకూర్చే ఎవరినీ ఊపేక్షించేది లేదన్నారు. తమ పార్టీ అధినేత కేసీఆర్‌కు కన్నబిడ్డ కన్నా ప్రజలు, తెలంగాణే ముఖ్యమని అన్నారు. కుటుంబంలో సమస్యలు సర్వసాధారణమని.. అవన్ని త్వరలోనే సమసిపోతాయని కామెంట్ చేశారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ అని.. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సీబీఐ పేరుతో కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలనుకోవడం సరికాదన్నారు. తెలంగాణ తెచ్చిన వ్యక్తి మనందరికీ నాయకుడిగా ఉండటం అదృష్టమని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు.

Next Story