- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల్లు కంపౌండ్ బంద్ చేస్తే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం : మాజీ మంత్రి
ఆదాయం వచ్చే కులవృత్తులను నాశనం చేయాలని ప్రభుత్వం చూస్తున్నదని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

- కులవృత్తులను నాశనం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర
- లిక్కర్ మాఫియాకు తలొగ్గి గీత వృత్తిని బంద్ పెట్టే ప్రయత్నం
- మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్
దిశ, తెలంగాణ బ్యూరో: ఆదాయం వచ్చే కులవృత్తులను నాశనం చేయాలని ప్రభుత్వం చూస్తున్నదని మాజీమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కులవృత్తులను కాపాడుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చి.. దేనిపైనా దృష్టి సారించడంలేదని అన్నారు. గీత కార్మికులకు ఐదు ఎకరాల పొలం ఇస్తామని చెప్పారని.. చెట్ల పైనుంచి పడి చనిపోతే రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పారని.. ఆ మాట తప్పారని పేర్కొన్నారు. ఉప్పల్ కల్లు కంపౌండ్‌ను నిషేధిస్తామని ప్రభుత్వం లీకులు ఇస్తున్నదని.. లిక్కర్ కంపెనీల కమీషన్లకు కక్కుర్తిపడి, లిక్కర్ మాఫియాకు తలొగ్గి కల్లు కంపౌండ్ బంద్ చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఓఆర్ఆర్ లోపల కల్లుపై నిషేధం విధించాలని ప్రయత్నాలు సాగిస్తున్నారని అన్నారు. కల్లు కంపౌండ్‌ను బంద్ చేస్తే ప్రభుత్వాన్ని నడవనీయమని హెచ్చరించారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని నిషేధించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలం అవుతున్నదని ప్రశ్నించారు. కల్తీ పాలు అరికట్టడంపై ఎందుకు దృష్టిపెట్టడం లేదన్నారు. లిక్కర్‌పై దాదాపు 35మంది ఎమ్మెల్యేలు నెలవారీ డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. కల్తీకల్లును ప్రోత్సహిస్తున్నది ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. గీత సంఘాల నుంచి ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుంటూ కల్తీ కల్లును ప్రోత్సహిస్తున్నారా? అని ప్రశ్నించారు. కల్లు దుకాణాలు బంద్ పెడితే బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద మామూళ్లు తీసుకుంటున్న ఎమ్మెల్యేల పేర్లు బయటపెడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు గట్టు రాంచందర్ రావు, నాగేందర్‌గౌడ్ పాల్గొన్నారు.






