Kishan Reddy: అధికారంలోకి వస్తే ముస్లిం బీసీ పదం తొలగిస్తాం.. కిషన్ రెడ్డి సంచనల ప్రకటన

by Prasad Jukanti |   (  Updated:2025-02-08 10:09:17  IST  )

తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే ముస్లిం బీసీ తొలగిస్తామని కిషన్ రెడ్డి సంచనల ప్రకటన చేశారు.

Kishan Reddy: అధికారంలోకి వస్తే ముస్లిం బీసీ పదం తొలగిస్తాం.. కిషన్ రెడ్డి సంచనల ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులు, యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయండ లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం కూడా ఉద్యోగులు, నిరుద్యోగుల పట్ల వివక్ష, నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రణాళికలపై శనివారం హైదరాబాద్‌ గోల్కొండ హోటల్‌లో కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అభ్యర్థులు, కీలక నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి ఢిల్లీలో 26 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతున్నది. అద్భుతమైన విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు తెలంగాణ బీజేపీ పక్షాన శుభాకాంక్షలు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి సానుకూల వాతవరణం ఉంది. రాబోయే రోజుల్లో కర్ణాటక, తెలంగాణలో బీజేపీ సొంతంగా అధికారంలోకి రాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు.

ముస్లిం బీసీ పదం తొలగిస్తాం?

ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అన్ని వర్గాలను మోసం చేసి బుజ్జగింపు రాజకీయలకు పాల్పడుతున్నదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. బీసీలను అవమానిస్తూ అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. కులగణన (Caste Census)తో దేశానికే తెలంగాణ ఆదర్శింగా నిలిచిందని రాహుల్ గాంధీ పార్లమెంట్ లో పది సార్లు చెబుతున్నారు. కానీ హిందూ బీసీలు, ముస్లిం బీసీలు (Muslim BC) అని విడగొట్టడమే మీ ఆదర్శమా అని నిలదీశారు. అసలు హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని రాజ్యంగంలో చెప్పారని నిలదీశారు. బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ల విషయంలో గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్యాయం చేశారు. ఇలాంటి విభజన బీసీల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతున్నదని చెప్పారు. బీసీలకు న్యాయం జరిగేలా రాబోయే రోజుల్లో ఉద్యమనిర్మాణం చేసి కాంగ్రెస్ కు బుద్ధిచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం బీసీ అనే పదాన్ని తప్పకుండా తొలగిస్తామన్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ఎన్నికల అభ్యర్థులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మూడు స్థానాలు టార్గెట్:

మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని కిషన్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ ప్రణాళికలు, భవిష్యత్ కార్యాచరణపై వివరిస్తూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల పక్షాన ఎండగట్టాలని కాంగ్రెస్ సర్కారు మోసాలను ప్రజలకు వివరించేలా ప్రచారాన్ని ఉధృతం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, పట్టభద్రులు, మేధావులు, నిరుద్యోగులు, విద్యార్థులు ప్రతిఒక్కరూ చైతన్యంగా ఆలోచించి ప్రజల పక్షాన నిలుస్తున్న బీజేపీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కోరారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో పీఆర్సీ, డీఏల విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

Next Story