ఆ వివరాలు చెప్పకుంటే ఫిర్యాదుదారులపైనే చర్యలు.. హైడ్రా సంచలన ప్రకటన

by Ramesh Goud |

హైడ్రా (Hydra) పరిధిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి (Prajavani Programme) వచ్చే ఫిర్యాదులలో (Complaints) ఫిర్యాదుదారులు కోర్టు లో ఉన్న అంశాల వివరాలను (Court Details) తప్పక నమోదు చేయాలని, లేదంటే ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హైడ్రా స్పష్టం చేసింది.

ఆ వివరాలు చెప్పకుంటే ఫిర్యాదుదారులపైనే చర్యలు.. హైడ్రా సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: హైడ్రా (Hydra) పరిధిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి (Prajavani Programme) వచ్చే ఫిర్యాదులలో (Complaints) ఫిర్యాదుదారులు కోర్టు లో ఉన్న అంశాల వివరాలను (Court Details) తప్పక నమోదు చేయాలని, లేదంటే ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హైడ్రా స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విట్టర్ (Twitter) వేదికగా కీలక ప్రకటన చేసింది. హైడ్రా ప్రతి సోమ‌వారం (Monday) నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదులు చేస్తున్నప్పుడు.. ఆ స‌మ‌స్యల‌కు సంబంధించిన అంశాలు సివిల్‌ (Civil Court), హైకోర్టు (High Court)లో పెండింగ్ (Pending) ఉంటే, ఆ వివ‌రాల‌ను ఫిర్యాదులో త‌ప్పకుండా పేర్కోవాల‌ని హైడ్రా కోరింది. అలాగే సివిల్‌, హైకోర్టులో పెండింగ్ కేసుల (Pending Cases) వివ‌రాల‌ను ఉద్దేశ‌పూర్వకంగా దాచి పెట్టిన ప‌క్షంలో ఫిర్యాదుదారుల‌పై చ‌ర్యలుంటాయ‌ని హెచ్చరించింది (Warning).

అంతేగాక వ్యక్తిగత వివాదాలు, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సమస్యలను హైడ్రా పరిష్కరించదని తేల్చి చెప్పింది. ఇక ప్రభుత్వ భూములతో పాటు ప్రజావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థలాల క‌బ్జాల‌కు సంబంధించిన అంశాల‌నే ప్రజావాణిలో ఫిర్యాదు చేయాల‌ని హైడ్రా ప్రజ‌ల‌కు సూచించింది. కాగా సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో హైడ్రాకు 46 ఫిర్యాదులు అందాయి. ఇందులో ఎక్కువగా పార్కు స్థలాల కబ్జాలకు సంబంధించిన ఫిర్యాదులే ఉన్నాయని హైడ్రా అధికారులు (Hydra Officials) తెలియజేశారు. అలాగే పార్కులు (Parks), ర‌హ‌దారులు (Roads), ప్రజావ‌స‌రాల‌ను ఉద్దేశించి ప‌లు లే ఔట్లలో (Lay Outs) కేటాయించిన స్థలాల‌ను అక్కడి కాల‌నీ సంక్షేమ సంఘాల ప్రతినిధులే (Walfare Union Leaders) క‌బ్జాలు (Seize) చేస్తున్నార‌ని ప‌లువురు ఫిర్యాదు చేశారని తెలిపారు. అంతేగాక కాల‌నీ ర‌హ‌దారుల‌ను (Colony Roads) కూడా వ‌ద‌ల‌కుండా.. ముందుకు జ‌రిగి ప్రహ‌రీలు నిర్మిస్తున్నార‌ని మరి కొందరు ఫిర్యాదు చేసినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.

Next Story