అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక పెడితే చీల్చిచెండాడుతాం.. హరీశ్ రావు సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-05 07:02:20  IST  )

తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ల సాగుతోందని, బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు.

అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక పెడితే చీల్చిచెండాడుతాం.. హరీశ్ రావు సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ల సాగుతోందని, బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు.. కమిషన్ వక్రీకరణలు, వాస్తవాలు’ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వీక్షించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు అన్ని జిల్లాల్లో డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. పవర పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలన అస్తవ్యస్తంగా తయారైందని కామెంట్ చేశారు. రైతులు కనీసం సాగు నీరు కూడా లేదని.. సరిపడా యూరియా ఇచ్చిన పాపాన పోలేదని హరీశ్ రావు ఆరోపించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కమిషన్ల పాలన సాగుతోందిన హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ప్రధాన ప్రతిపక్షంపై కక్ష సాధింపు కోసమే రాజకీయ కమిషన్లు వేశారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి బీఆర్ఎస్ పార్టీపై కుట్రలకు తెర లేపాయని ఫైర్ అయ్యారు. పొరుగు రాష్ట్రంలో పోలవరం మూడు సార్లు కూలినా కేంద్ర సంస్థ అయినా ఎన్‌డీఎస్ఏ అక్కడి వెళ్లలేదని.. కనీసం రిపోర్టు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇవాళ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కుట్ర పూరితంగా రేవంత్ సర్కార్ కాళేశ్వరం రిపోర్టును బయటపెట్టిందని ధ్వజమెత్తారు. కమిషన్ విచారణలపై మాకు నోటీసులు రాకముందే మీడియాకు తెలిసేది కాదని అన్నారు. నిన్న బయటపెట్టిన రిపోర్టులో అన్ని అబద్ధాలు, అవాస్తవాలు ఉన్నాయని అన్నారు. ఒకవేళ అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టును బయటపెడితే.. చీల్చిచెండాడుతామని హరీశ్ ప్రభుత్వానికి హరీశ్ రావు సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసలు నిజాలన్నీ అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తానని అన్నారు. రిపోర్టులో కేవలం తమకు అనుకూలంగా ఉన్న విషయాలనే నిన్న బయటపెట్టారని విమర్శలు గుప్పించారు.

Next Story