- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యేల అనర్హతపై వారంలో నిర్ణయం తీసుకోకుంటే జైలుకే.. స్పీకర్‍పై సుప్రీం సీరియస్
ఈ విషయంలో మీరు నిర్ణయం తీసుకుంటారా? లేదా మమ్మల్ని తీసుకోమంటారా? అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

దిశ, డైనమిక్ బ్యూరో : ఎమ్మెల్యేల అనర్హత విచారణ (MLAs Disqualification petition) విషయంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‍పై (Gaddam Prasad) సుప్రీంకోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో మీరు నిర్ణయం తీసుకుంటారా? లేదా మమ్మల్ని తీసుకోమంటారా? అని ప్రశ్నించింది. ఈ అంశంలో వచ్చేవారంలోపు నిర్ణయం తీసుకోవాలని లేదంటే కోర్టు ధిక్కారం కింద స్పీకర్‌ను జైలుకు పంపుతామని హెచ్చరించింది. రాబోయే నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో నిర్ణయించుకోండి అంటూ సీరియస్ కామెంట్స్ చేసింది. అనంతరం కేసు విచారణను 4 వారాలు వాయిదా వేసింది. అయితే కోర్టు ఇచ్చిన మూడు నెలల గడువు ముగిసినా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా కోర్టును ధిక్కరించారని స్పీకర్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి దాఖలైన మరో రెండు వేర్వేరు పిటిషన్లపై ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఎమ్మెల్యేల అనర్హతపై రోజువారీ విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సీజేఐ గవాయ్ స్పష్టం చేశారు. స్పీకర్ తరఫున న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, ముఖుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని ధర్మాసనానికి తెలిపారు.






