- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా క్యాంప్ ఆఫీసుకు వస్తే మెడబట్టి బయటకు గెంటేస్తా.. MLA మేఘారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక అఖరి విడత పోలింగ్ ఈ నెల 17న జరగనుంది. ఈ క్రమంలోనే తమ నియోజకవర్గ పరిధిలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రతి గ్రామంలో తమ అభ్యర్థుల తరఫున ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొని పార్టీ కేడర్‌లో జోష్‌ను నింపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మహబూబ్‌నగర్‌లోని అడ్డాకుల మండల పరిధిలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి (MLA Megha Reddy) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. బీఆర్ఎస్ (BRS) పార్టీ తరపున ఏ ఒక్క వార్డు మెంబర్ గెలిచినా.. అభివృద్ధి పనుల కోసం తన వద్దకే రావాలన్నారు. అలా అయితే ఒక్క పని కూడా జరగదని.. ప్రజలంతా కాంగ్రెస్ అభ్యర్థికే ఓటు వేయాలన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే.. వారిని తన క్యాంపు కార్యాలయంలోకి రాకుండా మెడబట్టి బయటకు గెంటేస్తానని అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. బాధ్యతయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి.. పార్టీలకు అతీతంగా ప్రజా సేవకు అంకితం కావాల్సిన ఎమ్మెల్యే బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా..? అని పలువురు కామెంట్ చేస్తున్నారు.






