- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబ్బులు పంపిణీ చేస్తే.. ఈ యాప్ ద్వారా అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు!
by Mallepaka Hamsa |
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు కొన్ని గంటల వ్యవధిలో జరగనున్న సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు కొన్ని గంటల వ్యవధిలో జరగనున్న సంగతి తెలిసిందే. రేపే పోలింగ్ కావడంతో డబ్బు సంచులు భారీగా పోలీసుల తనిఖీల్లో బయటపడుతున్నాయి. గ్రామాల్లో చాలా మంది తమ పార్టీకి ఓటు వేయాలని సైతం దేవుడిపై ప్రామాణాలు చేయించుకుని మరీ నగదు పంపిణీ చేస్తున్నారు. అయితే ఇలా ఎవరైనా డబ్బులిస్తే కనిపిస్తే వెంటనే మీరు స్మార్ట్ ఫోన్ ద్వారా ‘‘c vigil’’ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చును. ఈ యాప్ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని రిజిస్టర్ అయ్యాక డబ్బులు పంపిణీ చేస్తున్న ఫొటో లేదా వీడియోను అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత స్పెషల్ ఐడీ వస్తుంది వెంటనే అధికారులు దాన్ని ట్రాక్ చేసుకుంటా ఘటనా స్థలానికి వచ్చేస్తారు. ఫిర్యాదు చేసిన 10 నిమిషాల్లోనే అధికారులు అక్కడి చేరుకుని వారిపై చర్యలు తీసుకుంటారు.
Next Story






