- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ సాయంతోనే రేవంత్ రెడ్డి ఇదంతా.. జగదీష్ రెడ్డి సంచలన కామెంట్స్
కేసీఆర్ హరితహారం చేస్తే కాంగ్రెస్ హరిత సంహారం చేస్తోందని, బీజేపీ సహాయంతోనే రేవంత్ రెడ్డి 400 ఎకరాల భూమిని తీసుకుంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్ హరితహారం చేస్తే కాంగ్రెస్ హరిత సంహారం చేస్తోందని, బీజేపీ (BJP) సహాయంతోనే రేవంత్ రెడ్డి (Revanth Reddy) 400 ఎకరాల భూమిని తీసుకుంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి (BRS Leader Jagadeesh Reddy) అన్నారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan) లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. హెచ్‌సీయూ (HCU)లో విద్యార్థులపై లాఠీ చార్జ్ జరిగిన ఘటనపై స్పందించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. సెంట్రల్ యూనివర్సిటీని కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జీని ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, సోషల్ మీడియా, మీడియా, రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని మండిపడ్డారు.
విద్యార్థులు, యువత మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీని కాపాడుకునేందుకు విద్యార్థులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ అంటేనే కేసులు, లాఠీఛార్జీలు అని, మంత్రులు అక్కసు వెళ్లగక్కి విద్యార్థులను అవమానించి పెయిడ్ బ్యాచ్ అని మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెయిడ్ బ్యాచ్ సీఎం, మంత్రులు అని, విద్యార్థులు పెయిడ్ బ్యాచ్ అయితే కేసులు, లాఠీఛార్జీలు భరిస్తారా అని నిలదీశారు. పీసీసీ, సీఎం, మంత్రి పదవులు పేమెంట్‌తోనే అవుతున్నాయని ప్రజలకు తెలుసని, పేమెంట్ మీద పేటెంట్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. పేమెంట్లతోనే కాంగ్రెస్ నేతలకు పదవులు వచ్చాయని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు పేమెంట్లతో పదవులు పొందారని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు ప్రజల నుండి వచ్చిన వాళ్ళు కాదని ఆరోపించారు.
తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం హెచ్‌సీయూ విద్యార్థులకు అండగా నిలిచారని, కార్తీ చిదంబరం పేమెంట్‌తోనే మాట్లాడారా? అని, ప్రకాష్ రాజ్, ధృవ్ రాఠీ పేమెంట్‌తోనే మాట్లాడారా? అని ప్రశ్నించారు. 2012 సెప్టెంబర్ 16న హెచ్‌సీయూ భూములు ప్రైవేట్ వ్యక్తులకు చంద్రబాబు (Chandrababu) ఇస్తే కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ అడ్డం పడుతున్నాయని టీడీపీ (TDP)లో ఉండి రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. గురువు మొదలుపెట్టిన పేమెంట్‌ను శిష్యుడు రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని, కేసీఆర్ (KCR) హరితహారం (Harithaharam) చేస్తే కాంగ్రెస్ హరిత సంహారం (Haritha Samharam) చేస్తోందని విమర్శించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే అధికారులతో మాట్లాడి పోలీసులను అడ్డుకోవచ్చని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి నాటకం ఆడుతున్నాయని, కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay)లకు చిత్తశుద్ధి ఉంటే సెంట్రల్ యూనివర్సిటీలోకి రాకుండా పోలీసులను అడ్డుకోవచ్చని అన్నారు.
బీజేపీ సహాయంతోనే రేవంత్ రెడ్డి 400 ఎకరాల భూమిని తీసుకుంటున్నారని చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీపై రేవంత్ రెడ్డికి హక్కు లేదని, సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదని అన్నారు. గురువు లాగా అద్భుతమైన ఫోర్త్ సిటీ కడతామని రేవంత్ రెడ్డి అంటున్నారని, ఫోర్త్ సిటీలో, ఫ్యూచర్ సిటీలో భూమి ఇచ్చుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. 400 ఎకరాలు ప్రభుత్వానిది అయితే దొంగల్లాగా అర్ధరాత్రి ఎందుకు వెళ్లారని, ఇందులో ప్రభుత్వ పెద్దల చీకటి కోణం ఉందని, 400 ఎకరాల భూమిపై ప్రభుత్వం చీకటి ఒప్పందం చేసుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ యూనివర్సిటీలో మూడు చెరువులు ఉన్నాయని, హైడ్రా, రంగనాధ్ ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
సేవ్ హెచ్‌సీయూ అనే స్లోగన్‌కు ఐదు లక్షల మంది మద్దతు తెలిపారని, ఐదు లక్షల మంది పెయిడ్ బ్యాచేనా? అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్, కేటీఆర్‌పైన విషం కక్కడం ఎందుకు అని, ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ మద్దతు కోరడం విద్యార్థులు చేసిన తప్పా? అని నిలదీశారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం రాహుల్ గాంధీకి తెలియడం లేదా అని, చెల్లింపుల కోసమే రాహుల్ గాంధీ మాట్లాడటం లేదా? అని సంచలన ఆరోపణలు చేశారు. ఇక హెచ్‌సీయూలో జరుగుతున్న మారణకాండను ప్రభుత్వం ఆపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.






