కమ్యూనిజం కాదు గూండాయిజం.. కేరళ ప్రచారంలో భట్టి విక్రమార్క ఫైర్

by Prasad Jukanti |

తెలంగాణలో మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని ఎవరికైనా అనుమాం ఉంటే వచ్చి చూసుకోవవచ్చని భట్టి విక్రమార్క అన్నారు.

కమ్యూనిజం కాదు గూండాయిజం.. కేరళ ప్రచారంలో భట్టి విక్రమార్క ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎన్నికలకు ముందు మేము ఇచ్చిన హామీలలో దాదాపు అన్నింటిని అణలు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మా హామీల అమలుపై ఎవరికైనా అనుమానం ఉంటే తెలంగాణకు వచ్చి అనుమానాలు నివృత్తి చేసుకోవాలని, ఆర్థిక మంత్రిగా లెక్కలతో సహా అన్ని వివరిస్తానని అన్నారు. శనివారం ఆయన కేరళ రాష్ట్రంలోని పతనం తిట్ట(PAATHANAM THITTA) అసెంబ్లీ నియోజకవర్గం తో పాటు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల ముందు లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (LDF) ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని డిప్యూటీ సీఎం ఆరోపించారు. కేరళ రాష్ట్రంలో మార్పు, సంక్షేమం కోసం, సుపరిపాలన, సెక్యులర్ పాలన కోసం ఈనెల 9న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యుడిఎఫ్ (యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్) బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

కమ్యూనిజం కాదు గూండాయిజం:

కేరళలో పరిపాలన దారుణంగా పడిపోయిందని శబరిమల ఆలయంలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోయిందని దీంతో పొట్ట చేత పట్టుకొని కేరళ యువత ప్రపంచం నలుమూలలకు వలస పోతుంటే ఇక్కడున్న సీనియర్ సిటిజన్స్ కు సరైన సంక్షేమం, ఆదరణ లేకుండా పోయిందన్నారు. కేరళ అంటే సెక్యులరిజం, ఉన్నత విద్యావంతులు, గొప్ప మానవీయ కోణం ఉంటుందని అంతా భావిస్తాం. కానీ ఈరోజు కేరళలో ఆ తరహా పరిస్థితులు కనిపించకుండా పోయాయని విమర్శించారు. కేరళ అంటే కమ్యూనిజం, మార్క్సిజం గురించి మాట్లాడుతారు కానీ అది నేడు పక్కకు పోయి గుండాయిజం మాత్రమే కనిపిస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వాదులు శాంతి కామకులు, సుపరిపాలన, సెక్యులరిజాన్ని కోరుకుంటారని వివరించారు.

కేరళ సీఎం ప్రకటించుకుంటున్నారు:

తెలంగాణ మహిళలకు ఆర్టీసీ బుస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని ఇప్పటివరకు తెలంగాణ మహిళలు 10వేల కోట్ల ఉచిత ప్రయాణాలు చేసిన వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తుందని భట్టి చెప్పారు. రాష్ట్రంలో 1.06 కోట్ల కుటుంబాలకు సన్నబియ్యం, 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు, రూ.500 కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, రూ.రెండు లక్షల రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. విద్యపైన ఎక్కువ ఖర్చు చేస్తున్నామని కేరళ సీఎం ప్రకటించుకుంటున్నారు. కానీ విద్యపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 25 ఎకరాల్లో 200 కోట్లతో ఒక్కొక్క పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామన్నారు.

వారికోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ:

కేరళలో యూడీఎఫ్ కూటమిని అధికారంలోకి వస్తే కాలేజీలకు వెళ్లే మహిళలకు నెలకు రూ.1000 చొప్పున అందజేస్తామని, స్వయం ఉపాధి కోసం యువతకు వడ్డీ లేకుండా రూ.ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. సామాజిక పెన్షన్‍ను రెండువేల నుంచి మూడు వేలకు పెంపు, ఉమెన్ చాందీ పేరిట వృద్ధుల కోసం 25 లక్షల బీమా పథకాన్ని తీసుకురాబోతున్నామని చెప్పారు. యూడీఎఫ్ అధికారంలోకి రాగానే సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి వారి సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు.

Next Story